NTV Telugu Site icon

Samajika NyayaBheri: మహానాడు కాదు.. ఏడుపునాడు..

Ysrcp Yatra

Ysrcp Yatra

వైసీపీ మంత్రులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర పల్నాడు జిల్లా నరసరావుపేట చేరుకుంది. యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు స్థానిక ఎమ్మెల్యే గోపినాథ్ రెడ్డి, నేతలు, పార్టీ శ్రేణులు. బస్సు యాత్ర సందర్భంగా కిక్కిరిసింది నర్సరావుపేట. రాష్ట్రంలో సామాజిక న్యాయభేరీ యాత్ర చేసే హక్కు మాకే వుందన్నారు వైసీపీ మంత్రులు. నేల ఈనిందా? మహానాడు వేదిక పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బొమ్మ కూడా లేదు. అచ్చెన్నాయుడుకు సిగ్గు లేదా? బీసీలకు చంద్రబాబు ఇచ్చే గౌరవం ఇదేనా? మా అధినేత అన్ని వర్గాలకు ఏ స్థాయిలో గౌరవం ఇస్తున్నాడో మిమ్మల్ని చూస్తే అర్ధం అవుతుంది. సామాజిక న్యాయం యాత్ర చేసే హక్కు మాకు మాత్రమే ఉందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. మరో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాజీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల లకు గుర్తింపు, గౌరవం ఇస్తున్న వ్యక్తి జగన్. శ్రీకాకుళం నుంచి మాకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. చంద్రబాబుకు భయం వేస్తోంది. అందుకే అబద్దాల ఏడుపు ఏడుస్తున్నాడని ఎద్దేవా చేశారు.

టీడీపీ మహానాడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వ్యతిరేకమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది సీఎం జగన్‌ మాత్రమేనన్నారు. బడుగు, బలహీన వర్గాల పక్షపాతి సీఎం జగన్‌. బస్సు యాత్రకు ప్రతిచోటా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైఎస్సార్‌సీపీనే. చంద్రబాబుకు ఎల్లో మీడియా ఎంత బాకా ఊదినా లాభం లేదు. టీడీపీది మహానాడు కాదు.. ఏడుపునాడు మాత్రమేనని’’ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు.

ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. టీడీపీ హయాంలో బడుగు, బలహీన వర్గాలకు ఎన్నడైనా సాయం చేశారా అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు చేశారన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని చంద్రబాబు చూస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ నాయకత్వంలో సుపరిపాలన జరుగుతోందన్నారు. సామాజిక విప్లవం తెచ్చిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు.

సామాజిక న్యాయభేరితో చంద్రబాబు కర్ణభేరి పగిలిపోయిందని మంత్రి వేణుగోపాలకృష్ణ అన్నారు. సామాజిక విప్లవకారుడిగా సీఎం జగన్‌ చరిత్రలో నిలిచిపోతారన్నారు. పాలనలో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. జగనన్న ముద్దు.. బాబు అస్సలు వద్దు నినాదం కావాలని మంత్రి వేణుగోపాలకృష్ణ పిలుపునిచ్చారు. టీడీపీ హయాంలో దళితులపై దాడులు జరిగాయన్నారు మంత్రి అంజాద్ బాషా. అమలాపురంలో దాడుల వెనుక చంద్రబాబు ఉన్నారు.

భావితరాల భవిష్యత్తుకు జగన్ సిఎంగా ఉంటేనే సాధ్యం. చంద్రబాబు కుయుక్తులు నమ్మవద్దని మనవి చేస్తున్నాను. అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేసింది జగన్ ప్రభుత్వమే. ఏపీ క్యాబినెట్ లో 15 మంది మంత్రులు బీసీ, యస్టీ, మైనార్టీ మంత్రులు ఉన్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తునందుకు జగన్ తప్పుకోవాలా చంద్రబాబు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏకకాలంలో జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు అంజాద్ బాషా. గత ప్రభుత్వంలో మైనార్టీ లో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వెనుకబడిన వర్గాలకు సమాజంలో ‌సరైవ గౌరవం గత ప్రభుత్వాలలో లేదు. గతంలో మనం ఎన్నుకున్న, కోరుకున్న ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన వెనుకబడిన వర్గాలకు అధికారం దక్కలేదు. సామాజిక న్యాయం జగన్ ప్రభుత్వంలోనే సాధ్యమయ్యింది. చదువులో 22 స్థానంలో ఏపీ ఉంది. మూడు సంవత్సరాలలోనే రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కారం కావలనడం అత్యాశ.కోవిడ్ సమయంలో ఒక్క కుటుంబం కూడా ఇబ్బంది పడకుండా జగన్ పాలన చేశారు.మాపార్టీ కి ಓటు వేస్తేనే సంక్షేమ ఫలాలు అందిస్తామని జగన్ అనలేదు.

ప్రతి కుటుంబానికి సంక్షేమం అందింది. గతంలో జన్మభూమి బ్రోకర్లు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేశారు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజ్ రీఇంబర్స్‌మెంట్ వల్లే పేద‌వర్గాల విద్యార్థులు విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. పేదలకు సాయం చేసిన ప్రబుత్వం కూలిపోతుందంటే ఆవర్గాలను ఇక ఎవరు ‌రక్షిస్తారు? చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఉండవన్నారు.

Chandrababu Naidu: మేం భయపడేదే లేదు. బుల్లెట్లా దూసుకెళ్తాం