NTV Telugu Site icon

పీఆర్‌సీపై కీలక ప్రకటన చేసిన సజ్జల

ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటినుంచే ఎదురుచూస్తున్న పీఆర్‌సీపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ ప్రధాన కార్యదర్శి కీలక ప్రకటన చేశారు. పీఆర్‌సీపై కసరత్తు జరుగుతోందని.. త్వరలోనే ఉద్యోగులు శుభవార్త వింటారని ఆయన వెల్లడించారు. దీనిపై సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డితో చర్చిస్తున్నట్లు ఆయన తెలిపారు.

అంతేకాకుండా ఇప్పటికే పీఆర్‌సీపైన ప్రకటన చేయాలనుకున్నామని, కానీ.. కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయామన్నారు. త్వరలోనే పీఆర్‌సీపై గుడ్‌న్యూస్‌ ఉద్యోగులు వింటారని ఆయన అన్నారు. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఈ నెలలో ఉన్న నేపథ్యంలో సజ్జల చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.