NTV Telugu Site icon

Sajjala Ramakrishna Reddy: వైఎస్‌ వివేకా కేసు.. అవినాష్‌రెడ్డి కాల్‌ రికార్డులో సంచలనం ఏమీ లేదు..

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్‌ వివేకా నందరెడ్డి కేసులో.. సీబీఐ దూకుడు పెంచింది.. వరుసగా నిందితులను ప్రశ్నిస్తోంది.. మరోవైపు, కేసులో విచారణ సాగుతోంది.. అయితే, ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… ఎంపీ అవినాష్‌రెడ్డి కాల్‌ రికార్డులో సంచలనం ఏమీ లేదన్నారు.. అవినాష్‌రెడ్డి ఫోన్‌ను ఆరోజే పోలీసులు చెక్‌ చేశారు. నాలుగు రోజుల నుంచి తెగ ప్రచారం చేస్తున్నారని.. కుట్ర కోణం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Kishan Reddy : గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు

సమాచారం ఇవ్వడం కోసం సిబ్బందికి సర్వసాధారణం అన్నారు సజ్జల.. సీఎం జగన్‌కు లింక్‌ చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.. నవీన్‌.. వైఎస్‌ జగన్‌ ఇంట్లో అటెండర్.. జగన్‌ దగ్గర ఫోన్‌ లేదు కాబట్టి నవీన్‌కి ఫోన్‌ చేశారని తెలిపారు.. కృష్ణమోహన్‌రెడ్డి, నవీన్‌ ఈ రోజు కూడా జగన్‌ వద్దనే ఉన్నారు.. కానీ, ఇందులో ఏదో కుట్ర కోణం ఉందంటూ తప్పుడు ప్రచారం చేయడం సరికాదని హితవుపలికారు. కుటుంబ పెద్దగా ఉన్న వ్యక్తికి దారుణం జరిగిన తర్వాత.. సమాచారం చేరవేయడం కూడా తప్పే అవుతుందా? అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి.. అయితే, ఈ కేసులో నీచమైన రాజకీయాలు చేస్తున్నారు.. చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలు చేయడంలో ముందుంటారు అని ఆరోపించారు సజ్జల..