Site icon NTV Telugu

YSRCP Social Media wing: సోషల్‌ మీడియా వింగ్‌పై సీఎం ఫోకస్‌.. సజ్జల తనయుడికి బాధ్యతలు..

Ys Jagan

Ys Jagan

సోషల్‌ మీడియా ప్రభావం క్రమంగా పెరుగిపోతోంది.. అందిలో వచ్చేవి వైరలా? రియలా? అని తెలుసుకునేలోపే.. కొన్ని సార్లు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది… దీంతో, సోషల్‌ మీడియా వింగ్‌ పటిష్టంపై ఫోకస్‌ పెట్టారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్.. సోషల్ మీడియాను పటిష్టం చేయటంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు.. ఇక, సోషల్ మీడియా బాధ్యతలు చూడటానికి తెర మీదకు కొత్త పేరు వచ్చింది… వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డికి సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు వైసీపీ అధినేత.. ఇక, ముఖ్యమంత్రి నేతృత్వంలో రెండు గంటల సేపు భార్గవ్‌, సోషల్ మీడియా వింగ్ నేతలు సమావేశం అయ్యారు..

Read Also: 87 Year Old Dials Helpline: హెల్ప్‌ సెంటర్‌కు 87 ఏళ్ల బామ్మ ఫోన్.. మా ముసలోడు ఆగడంలేదని ఫిర్యాదు..!

ఇప్పటి వరకు సోషల్ మీడియాతో సహా పార్టీ అనుబంధ విభాగాల బాధ్యత చూస్తూ వస్తున్నారు పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. అయితే, సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల దాడి, ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో కౌంటర్ స్ట్రాటజీ టీం అవసరం అని భావిస్తున్నారు సీఎం వైఎస్‌ జగన్.. మీడియా, సోషల్ మీడియా బాధ్యతలు ఒకరి వద్ద ఉంటేనే సమన్వయంగా స్పందించటానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తోంది. విపక్షాల నుంచి సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై ఎటాక్‌ పెరగడంతో.. అంతకు రెట్టింపు ప్రతిస్పందనలో తమ టీమ్‌ నుంచి ఉండాలనేది జగన్‌ ఆలోచన ఉందట. దీంతో, సోషల్‌ మీడియా వింగ్‌పై ఫోకస్‌ పెట్టారు సీఎం వైఎస్‌ జగన్‌..

Exit mobile version