NTV Telugu Site icon

తగ్గుతున్న పాజిటీవ్ కేసులుః ఇంద్ర‌కీలాద్రికి పెరుగుతున్న భ‌క్తులు…

ఏపీలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  కేసులు త‌గ్గుముఖం పడుతుండ‌టంతో వ‌ర‌స‌గా స‌డ‌లింపులు ఇస్తున్నారు.  ప్ర‌స్తుతం మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల వ‌ర‌కు స‌డ‌లింపులు ఉన్నాయి.  జూన్ 20వ తేదీనుంచి మ‌రికొన్ని స‌డ‌లింపులు ఇచ్చే అవ‌కాశం ఉన్న‌ది.  మ‌ధ్యాహ్నం వ‌ర‌కు స‌డ‌లింపులు ఉండ‌టం, క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో దేవాల‌యాల‌కు తాకిడి పెరుగుతున్న‌ది.  

Read: బీచ్ లో కుర్రాడితో జాన్వీ… ఎవరబ్బా ?

విజ‌య‌వాడ‌లోని ఇంద్ర‌కీలాద్రికి భ‌క్తుల తాకిడి క్ర‌మంగా పెరుగుతున్న‌ది.  ర‌ద్ధీని దృష్టిలో పెట్టుకొని అన్న‌దానం కార్యక్ర‌మాన్ని పున‌రుద్ధ‌ర‌ణ చేశారు.  క‌రోనా నిబంధ‌న‌ల‌తో ప్యాకెట్ల రూపంలోఅన్న‌దానం చేస్తున్నారు.  క‌రోనా కేసులు త‌గ్గుతున్నా, తీవ్ర‌త ఉండ‌టంతో చిన్నారుల‌కు, 60 ఏళ్లు పైబ‌డిన‌వారిని అనుమ‌తించ‌డంలేదు.  క‌రోనా కార‌ణంగా ఇంద్ర‌కీలాద్రీ ఆదాయం పూర్తిగా త‌గ్గిపోయింది.