CM Chandrababu: ఆటో డ్రైవర్లకు రూ. 436 కోట్ల చెక్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరూ OG సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు.. విజయవాడ ఉత్సవ్ తో నగరానికి కొత్త కళ వచ్చింది.. నేరుగా లబ్ధిదారులకు డబ్బులు జమ అయ్యాయి.. ఆటో డ్రైవర్లకు అనేక కష్టాలు ఉన్నాయి.. గతంలో రోడ్లు గతుకులతో ఆటోలు, డ్రైవర్ల ఒళ్లు హూనం అయ్యేది అని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ మరింత పెరగాలి.. గత ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటు తో గెలిచారు.. నాలుగోసారి గెలిచిన నాకు కూడా ఏం చేయాలో మొదట్లో అర్థం కాలేదు.. స్త్రీ శక్తి పథకంతో మహిళలు ఎక్కడకి అంటే అక్కడి వెళ్ళగలుతున్నారు.. దసరా సమయంలో అమ్మవారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుంచి మహిళలు ఇంద్రకీలాద్రికి వచ్చారు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Sanae Takaichi: జపాన్ చరిత్రలో కొత్త అధ్యయనం.. ప్రధానిగా తొలిసారి మహిళ ఎన్నిక
ఇక, ఆటో డ్రైవర్ల సేవలో డబ్బులు రాని వారు ఎవరో తెలియజేస్తే వారికి ఇచ్చే బాధ్యత నాది అని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు రాష్ట్రంలోని రోడ్లన్నీ బాగు పడుతున్నాయి.. రూ. 3400 కోట్లతో రోడ్లన్నీ బాగు చేస్తున్నాం.. 23 వేల కిలో మీటర్ల మేర రోడ్ల మరమ్మతులు చేశాము.. గత ఐదేళ్లు రోడ్లపై గుంతలే గుంతలు.. నేను రోడ్లు వేస్తే గత పాలకులు గుంతలు చేశారు.. ఇకపై రోడ్లపై గుంతలు పడకుండా చూసుకోవలసిన బాధ్యత మీదే.. జరిమానాల జీఓ రద్దు చేస్తాం.. సీసీటీవీలో అంతా రికార్డ్ అవుతోంది కాబట్టి సరిగ్గా, క్రమశిక్షణగా ప్రతి ఒక్కరు ఉండాలని కోరుతున్నా.. ఆటో వాళ్ళ కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆటోలు ఈవీగా మార్చటానికి అన్ని చర్యలు చేపడతామని చంద్రబాబు పేర్కొన్నారు
Read Also: Tahsildar Attacked: అమ్మవారి గుడిలోకి షూతో వచ్చిన ఎమ్మార్వో.. పొట్టు పొట్టు కొట్టిన భక్తులు
అయితే, 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో నవ్వే పరిస్థితి లేదు, పండుగ చేసుకునే పరిస్థితి లేదు.. పరదాలు కట్టుకుని వచ్చే వాడు అని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. గత ఐదేళ్లలో చూసిన విద్వంసం గతంలో ఎప్పుడూ నేను చూడలేదు.. ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు పనికి వస్తారా?.. ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి.. మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటి దుష్టశక్తులు రాకుండా చెడు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అన్నీ ఇచ్చిన తర్వాత మనోళ్లు ఒక ఆలోచన చేస్తారు.. మళ్ళీ వేరే వాళ్ళు వస్తే ఏదో ఇస్తారని ఆశ పడతారు.. కానీ, ఏమీ ఇవ్వని ఉన్నవన్నీ తీసేస్తారని తెలుసుకోవాలి.. గుజరాత్ లో 25 ఏళ్లుగా ఒకటే బీజేపీ పాలన నడుస్తుంది అని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.
