Site icon NTV Telugu

Ropeways in Andhra Pradesh: పర్యాటక అభివృద్ధిపై సర్కార్ కసరత్తు.. రోప్ వేల ఏర్పాటుపై ప్రణాళికలు

Ropeways,

Ropeways,

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సర్కార్ కసరత్తు చేస్తోంది.. కేంద్ర ప్రభుత్వ పర్వత మాల ప్రాజెక్టులో భాగంగా రోప్ వేల ఏర్పాటుపై ప్రణాళికలు సిద్దం చేస్తోంది సర్కార్.. ఈగల పెంట-శ్రీశైలం మధ్య రోప్ వే ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు.. ప్రీ ఫీజుబులిటి స్టడీ పూర్తి చేశారు.. మార్చి నెల నుంచి ఈగల పెంట-శ్రీశైలం మధ్య రోప్ వే ఏర్పాటుకు టెండర్లు పిలిచేందుకు సిద్ధమైంది వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఇదే కాకుండా.. మరో మూడు పర్యాటక ప్రాంతాల్లో రోప్ వే ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది.. విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి భవానీ ఐల్యాండ్, లంబసింగి, గండికోట పర్యాటక ప్రాంతాల్లో రోప్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

Read Also: Off The Record about Aleru TRS: ఆలేరు గులాబీ శిబిరంలో అలజడి.. ఎమ్మెల్యే దంపతులపై కేడర్‌ గుర్రు..!

రోవ్‌ వేల ఏర్పాటుపై ప్రీ ఫీజుబిలిటీ స్టడీ కొనసాగిస్తోంది ఏపీ సర్కార్.. మార్చిలోగా ఫీజుబిలిటీ స్టడీ పూర్తయ్యే ఛాన్స్ ఉంది.. కేంద్రం అంగీకారం లభిస్తే.. ఏప్రిల్ లేదా మే నెలలో టెండర్లు పిలిచే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.. ఒక్కో ప్రాజెక్టుకు రూ. 400 కోట్లు అంచనా వేస్తున్నారు.. విశాఖ బీచ్ రోడ్‌లో కేబుల్ కార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి.. దాదాపు ఏడెనిమిది కిలో మీటర్ల మేర కేబుల్ కార్ ఏర్పాటుకు ప్రపోజల్స్ సిద్ధం చేశారు.. విశాఖలోని వివిధ బీచ్ లను కలిపేలా కేబుల్ కార్ ఏర్పాటుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. మొత్తంగా.. పర్యాటక రంగాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించే పనిలో పడిపోయింది వైసీపీ సర్కార్. ఇప్పటికే నేషనల్‌ లాజిస్టిక్‌ మేనేజ్మెంట్‌ లిమిటెడ్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ఏపీటీడీసీ. రోప్‌ వేల నిర్వహణ బాధ్యతను నేషనల్‌ లాజిస్టిక్‌ మేనేజ్మెంట్‌ లిమిటెడ్‌ చేపట్టనుంది. ఏపీకి రోప్‌వే హంగులు రాబోతున్నాయి. కేంద్ర పథకం పర్వత మాల పథకంలో భాగంగా ఏపీలో మొత్తంగా 26 ప్రాంతాల్లో రోప్‌ వే ఏర్పాటు చేయడానికి కసరత్తు ముమ్మరంగా సాగుతున్నట్టు వార్తలు వచ్చినా.. ముందు మూడు, నాలుగు చోట్ల ఇవి ఏర్పాటు చేయబోతున్నారు.. ఏపీలో అతి తక్కువ ప్రదేశాల్లో మాత్రమే రోప్‌వే అందుబాటులో ఉంది. ప్రస్తుతం శ్రీశైలం, విశాఖ కైలాసగిరి వంటి ప్రాంతాల్లో తప్ప.. మిగిలిన చోట్ల ఎక్కడ రోప్‌ వే లేదు. అయితే ఆ కొరత తీర్చేందుకు.. పైనుంచి ప్రకృతి అందాలను చూసి పులకరించేందుకు ఏపీలో భారీ ఎత్తున రోప్‌వేలను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమవుతోంది.

Exit mobile version