Site icon NTV Telugu

రహదారుల మరమ్మత్తులు ఒక డ్రైవ్‌లా చేపట్టాలి: సీఎం జగన్‌

రహదారుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. అధికారులకు కీలక సూచ నలు చేశారు. రాష్ర్టంలో రహదారుల మరమ్మత్తులు ఒక డ్రైవ్‌లా చేప ట్టాలని సూచించారు. రాష్ట్రంలో రహదారుల పై ఉన్న గుంతలు తక్ష ణమే పూడ్చాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.46 వేల కిలోమీటర్ల రోడ్ల మరమ్మత్తులపై అధికారులు దృష్టి పెట్టాలని సీఎం కోరారు.

ముందు పాట్‌ హోల్‌ ఫ్రీ స్టేట్‌గా రహదారులు ఉండాలి, తర్వాత కార్పెటింగ్‌ పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. విమర్శలకు తావివ్వకుండా చక్కటి రహదారులు వాహనదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్‌ అన్నారు. ఎన్‌డీబీ ప్రాజెక్ట్‌లలో టెండర్లు దక్కించుకుని పనులు ప్రారంభించని కాంట్రా క్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. పనులు ప్రారంభించే కాంట్రాక్టర్లకే ప్రాజెక్టులను ఇవ్వాలన్నారు. 2022 జూన్‌ నాటికి రాష్ట్రంలో రహదారుల మరమ్మత్తులు, పునరుద్ధరణ పూర్తి కావాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Exit mobile version