త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు.. నిర్మాణాలు చేపడతాం: ఎంటీ కృష్ణబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్వరలోనే రోడ్ల మరమ్మత్తులు.. నిర్మాణాలు చేపట్టనున్నట్లు ఆర్ అండ్‌బీ ముఖ్య కార్యదర్శి, ఎంటీ కృష్ణబాబు తెలిపారు. సీఎం సూచనల మేరకు ముందుగా రోడ్ల మరమ్మత్తులు మొదలు పెట్టనున్నట్లు తెలిపారు. రోడ్ల మరమ్మత్తులు, నిర్మాణాలకు ప్రభుత్వం రూ. 2,205 కోట్లు కేటాయించింది. రోడ్లను బాగు చేసేందుకు నిధులను సమీకరిస్తున్నాం. రోడ్ సెస్ ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఎస్క్రో చేసి అప్పు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. 8,268 కి.మీ పొడవు రోడ్లను మెరుగుపరచడానికి.. 308 స్టేట్ హైవే రోడ్లను రూ. 923 కోట్లతో అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నట్టు ఆయన తెలిపారు.
జిల్లాల్లోని మేజర్ రోడ్లను రూ. 1,282 కోట్లతో చేపట్టాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. ఇప్పటికే కొన్ని పనులకు టెండర్లు ఆహ్వానించినట్టు వెల్లడించారు. 328 రోడ్లకు రూ. 604 కోట్ల విలువైన పనులు అప్పగించి అగ్రిమెంట్ చేసుకున్నాం. మిగిలిన 819 పనులకు, రూ. 1,601 కోట్ల వ్యయంతో, త్వరలో టెండర్లు ఆహ్వానిస్తాం. వచ్చే నెల మూడో వారంలోగా రోడ్ల పనులను ప్రారంభిస్తాం. ఇప్పటికే అప్పగించిన పనులు వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభమవుతాయని తెలిపారు.
Also Read
- AP Govt: చిత్తడి నేలల పరిరక్షణకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం.. ‘కొండకర్ల ఆవ’ కన్జర్వేషన్ రిజర్వ్‌గా ప్రకటన..
- Botsa Satyanarayana: ‘ప్రజా సమస్యలను వదిలేసి ప్రభుత్వం పబ్లిసిటీ డ్రామాలు ఆడుతోంది’..
- AP Rain Alert: ఉగ్రరూపం దాల్చిన సముద్రం.. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..
- El Niño Impact: కొబ్బరిబొండాల పైనా 'ఎల్‌నినో' ఎఫెక్ట్.. అప్పుడు మూడు, ఇప్పుడు ఆరు!
ఈ పనులను చేపట్టేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పటికే రూ. 2,000 కోట్ల రుణాన్ని మంజూరు చేసిట్టు తెలిపారు. వచ్చే మొదటి వారంలోగా బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన వెల్లడించారు. కాగా ఈ పనులన్ని 2022 చివరి నాటికి పూర్తి అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు ఎంటీ కృష్ణ బాబు తెలిపారు. ఏపీలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఎప్పటి నుంచో జగన్ ప్రభుత్వం పై అటు ప్రతిపక్షాలు, ప్రజలు ఆరోపణలు చేస్తున్న విషయం విధితమే.
- Tags
- AP Roads
- krishnababu
- ycp
తాజావార్తలు
-
CM Revanth Reddy : యువతే గేమ్‌చేంజర్.. మోడీపై రేవంత్ విమర్శలు
-
Sikandar Raza: ‘త్వరలోనే కొన్ని పరుగులు కొనుక్కుంటా’.. ఓటమిపై సికందర్ రజా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Adilabad Airfield : ఆదిలాబాద్‌కు ఎయిర్పోర్ట్ బూస్ట్.. ₹2,278 కోట్ల మెగా ప్రాజెక్ట్
-
Shreyas Iyer: ‘నా ఫస్ట్ విన్ క్రెడిట్ అతనికే’.. అయ్యర్ నోటి నుంచి ఊహించని మాట..
-
Abhijeet Dipke: టైమ్ కావాలి, పంజాబ్ పేపర్ లీక్‌పై స్పందిస్తాము..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో చర్మ దురదకు చెక్.. త్రిఫలతో సహజ చిట్కాలు!
-
CSK-Hardik Pandya: ఇద్దరు టాప్ స్టార్ ప్లేయర్స్, రూ.10 కోట్లు.. హార్దిక్ పాండ్య కోసం సీఎస్కే భారీ ఆఫర్!
-
Ishan Kishan: వైభవ్ సూర్యవంశీకి అన్ని తెలుసు.. ఆ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త అని హెచ్చరించాం!
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!