Site icon NTV Telugu

Road Accident: పల్టీలు కొట్టిన వాహనం.. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

Peddireddy

Peddireddy

Road Accident: ఆంధ్రప్రదేశ్‌ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది.. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది… పెద్దిరెడ్డి రాంచంద్రా రెడ్డి, మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు పుంగనూరు నుండి వీరబల్లిలోని అత్తగారి ఇంటికి బయల్దేరి వెళ్లారు.. అయితే, మార్గం మధ్యలో మరో కారు వచ్చి కాన్వాయ్‌ని ఢీకొట్టింది… ఎంపీ మిథున్ రెడ్డికి చెందిన వాహనాన్ని ఎదురుగా వచ్చి బలంగా ఢీకొట్టింది మరోకారు.. ఈ ప్రమాదంలో ఎంపీ వాహనం పల్టీలు కొట్టింది… మిథున్ రెడ్డి వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తిగత కార్యదర్శి , భద్రతా సిబ్బందికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది… క్షతగ్రాతులను వెంటనే రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అయితే, మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలు కలిసి మంత్రి వాహనంలో వెళ్తుండడంతో పెను ప్రమాదం తప్పింది.. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది..

Read Also: Fasting Benefits: ఉపవాసంతో అద్భుత ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?

Exit mobile version