Site icon NTV Telugu

RK Roja: సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయను.. కళాకారుల సమస్యలు నాకు తెలుసు

Rk Roja

Rk Roja

సీఎం వైఎస్‌ జగన్‌ నమ్మకాన్ని వమ్ము చేయను.. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు మంత్రి ఆర్కే రోజా… సచివాలయంలోని రెండో బ్లాకులోని టూరిజం మంత్రి శాఖ చాంబర్‌లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.. బాధ్యతలు స్వీకరించే ముందు సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి వచ్చారు.. బాధ్యతలు స్వీకరించేముందు గుమ్మడికాయతో దిష్టి తీశారు రోజా భర్త సెల్వమణి.. మంత్రి చాంబర్‌లో చైర్‌లో కూర్చొన్న తర్వాత తల్లికి ముద్దు పెట్టారు రోజా కూతురు… ఇక, ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. పార్టీ పెట్టక ముందు నుంచి జగన్ అడుగు జాడల్లో నడిచాను.. మంత్రులుగా ఉన్న వాళ్లంతా జగన్ సైనికుల్లా పనిచేశారు.. ఇప్పుడు మంత్రి వర్గంలో ఈక్వేషన్లను బేస్ చేసుకుని కేటాయింపులు జరిగాయన్నారు.. వైఎస్‌ జగన్ లాంటి నేతతో కలిసి నడవడం మా అదృష్టంగా తెలిపిన ఆమె.. జగన్ పాలన చూసి అన్ని రాష్ట్రాలు మెచ్చుకుంటున్నాయన్నారు.

Read Also: KTR: డిసెంబర్‌ నాటికి 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం రెడీ…

పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతీ ఒక్కరికి సీఎం వైఎస్‌ జగన్‌ న్యాయం చేస్తున్నారని తెలిపారు మంత్రి రోజా.. సీఎం జగన్ నమ్మకాన్ని వమ్ము చేయనన్న ఆమె.. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించి అభివృద్ధి చేస్తాం అన్నారు.. సముద్ర తీర ప్రాంతాలను టూరిజం కోసం అభివృద్ధి చేస్తాం.. దేశ విదేశీ టూరిస్టులను అనుకూలమైన టూరిజంను రాష్ట్రంలో నిర్మిస్తామని వెల్లడించారు. మరోవైపు.. క్రీడలను కూడా అభివృద్ధి చేస్తా.. గ్రామీణ క్రీడలను ప్రోత్సహిస్తాం., క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తామని.. క్రీడాకారులకు వసతులు కల్పిస్తామని తెలిపారు.. ఆర్టిస్టుగా కళాకారుల సమస్యలు నాకు తెలుసు.. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటానన్న ఆర్కే రోజా.. గండికోట నుంచి బెంగుళూరుకు టూరు కోసం మొదటి బస్సుపై సంతకం చేసినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు.

Exit mobile version