Site icon NTV Telugu

నేడు నాన్ వెజ్ మార్కెట్లపై ఆంక్షలు…

నేడు విజయవాడలో నాన్ వెజ్ మార్కెట్లపై ఆంక్షలు వర్తిస్తాయి. చేపల మార్కెట్లకు కేవలం 12 గంటల వ‌ర‌కు మాత్రమే అనుమతి ఉంది. మార్క్ ట్ బ‌య‌ట చికెన్‌, మాట‌న్ షాపుల‌కు ఉదయం 6 నుంచి మ‌ధ్యాహ్నం 2 గంటల వ‌ర‌కు అనుమతి ఉంది. అయితే నగరంలో 144 సెక్షన్ అమ లులో ఉన్నందున మార్కెట్లు, షాపుల్లో ఐదుగురికి మించి గుమికూడకుండా షాపుల నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు నగర కమిషనర్. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాలని సూచించారు. దూరం దూరంగా ప్రజలు క్రమ పద్దతిలో కొనుగోలు చేసుకొనేలా మార్కింగ్ ఏర్పాటు చేసుకోవలని… ఎవరైనా నగరపాలక అధికారులు ఆదేశాలు ఉల్లంగిస్తే వారిపై క‌ఠీన చర్యలు తప్పవని హెచ్చరించారు కమిషనర్.

Exit mobile version