NTV Telugu Site icon

జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానం

ఈ మ‌ధ్య గుంటూరులోని జిన్నా ట‌వ‌ర్‌పై పెద్ద చ‌ర్చే సాగుతోంది.. గుంటూరు నగరంలో ఉన్న చారిత్రాత్మక కట్టడానికి పాకిస్థాన్ జాతిపిత ఐన మహమ్మద్ అలీ జిన్నా పేరు పెట్టారు.. అయితే, భార‌తీయ జ‌న‌తా పార్టీ త‌ర‌చూ దీనిని లేవ‌నెత్తుతోంది.. రిపబ్లిక్ డే సందర్భంగా జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ‘హిందూ వాహిని’ పిలుపునివ్వ‌డం కూడా ర‌చ్చ‌గా మారింది.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిన్నా టవర్‌పై ప్రభుత్వమే జాతీయ జెండాను ఎగురవేయాలని.. ప్రభుత్వం స్పందించకుంటే హిందూ వాహినితో కలిసి బీజేపీ నేతలే జాతీయ జెండాను ఎగురవేస్తారని కూడా ప్ర‌క‌టించారు.. అయితే, జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానం చేసిన‌ట్టు తెలిపారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్త‌ఫా..

Read Also: సీఎం జ‌గ‌న్‌కు సోము వీర్రాజు లేఖ‌.. అవి పునాది రాళ్లకే పరిమితం..!

ఇవాళ జిన్నా టవర్ వద్ద ఫెన్సింగ్ పనులను‌ పరిశీలించారు ఎమ్మెల్యే ముస్తఫా, మేయర్ కావటి మనోహర్… ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే ముస్తఫా.. జిన్నా టవర్ వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని తీర్మానం చేశామ‌ని వెల్ల‌డించారు.. జాతీయ జెండా ఎగుర వేసే సమయంలో అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం ప‌లుకుతామ‌న్న ఆయ‌న‌.. కులం, మతం, ప్రాంతం చూడకుండా వారి అభివృద్ధే మా ప్రభుత్వ విధానం అని స్ప‌ష్టం చేశారు. కానీ, రాజకీయ ల‌బ్ధి కోసం కొన్ని పార్టీలు ఏవేవో చేస్తున్నారు అంటూ మండిప‌డ్డారు ఎమ్ముల్యే ముస్త‌ఫా.