NTV Telugu Site icon

రెడ్డి, క‌మ్మ కార్పొరేష‌న్లు ఏర్పాటు.. ఉత్త‌ర్వులు జారీ

YS Jagan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స‌ర్కార్ సంచలన నిర్ణయాలను తీసుకుంది. అగ్రకులాల కోసం సంక్షేమాభివృద్ధి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది వైసీపీ స‌ర్కార్… రెడ్డి సంక్షేమ‌, అభివృద్ధి కార్పొరేష‌న్ ఏర్పాటుతో పాటు.. కమ్మ కులస్తుల‌కు కూడా కార్పొరేష‌న్ ఏర్పాటు చేసింది.. రెడ్డి కులస్తులు, క్షత్రియుల కోసం వేర్వేరుగా మూడు కార్పొరేషన్లను నెలకొల్పింది. ఈ మేరకు ఉత్త‌ర్వులు జారీ చేసింది ప్ర‌భుత్వం.. ఈ మూడు కార్పొరేషన్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ప‌నిచేయ‌నున్నాయి.. ఆయా వ‌ర్గాల్లో ఆర్థికంగా వెనుక బడినవారికి చేయూత ఇవ్వటమే ఉద్దేశ్యమని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్ర‌భుత్వం.. కాగా, రెడ్డి సామాజిక వర్గం.. వైసీపీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉంది.. ఇదే స‌మ‌యంలో.. ప్ర‌తిప‌క్ష టీడీపీకి క‌మ్మ సామాజిక‌వ‌ర్గం ఓటు బ్యాంకుగా ఉంది.. ఇటు త‌న ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే.. ప్ర‌త్య‌ర్థుల ఓటు బ్యాంకును కూడా దెబ్బ కొట్టేందుకు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నార‌నే అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.