NTV Telugu Site icon

Heavy Rain in Telangana- Ap states: తెలుగు రాష్ట్రాల్లో వర్షం బీభత్సం.. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద

Heavy Rain In Telangana, Ap States

Heavy Rain In Telangana, Ap States

Heavy Rain in Telangana, Ap states: నాలుగు రోజులుగా వర్షాల కారణంగా రాష్ట్రంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లు, రోడ్లపైకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరదల వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి బహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఇక ప్రాజెక్టులకు వరద ఉధృతి భారీగా పెరగడంతో.. ప్రాజెక్టులకు గేట్లు ఎత్తివేసి నీటి దిగువకు వదులుతున్నారు అధికారలు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఈవానలు ఇంకా మూడురోజుల పాటు వుంటుందని ప్రజలు అవసరమైతే తప్పా బయటకు రావద్దని, ప్రాయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. తెలంగాణ, ఏపీలో ప్రాజెక్టులు నిండటంతో.. నీటిని దిగువలకు పంపించే పనిలో పడ్డారు అధికారలు.

సంగారెడ్డి జిల్లాలో.. సింగూరు ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో- 25048 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో- 35179 క్యూసెక్కులు కావడంతో.. డు గేట్లు తెరిచి నీరు దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ప్రస్తుత నీటి మట్టం- 28.885 టీఎంసీలు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం- 29.917 టీఎంసీలు.. ఇక జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

మహబూబ్ నగర్ జిల్లాలో.. జూరాలకు వరద కొనసాగుతుంది. 41 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నా అధికారులు. ఇన్ ఫ్లో 1,99,844 క్యూసెక్కులు.ఔట్ ఫ్లో : 1,97,367 క్యూసెక్కులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం :1045 ఫీట్లు, ప్రస్తుత నీటిమట్టం 1,043.241 ఫీట్లు .పూర్తి నీటి సామర్థ్యం:9.657 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ: 8.751 టీఎంసీలు, 11 యూనిట్లతో విద్యుత్ ఉత్పత్తి, ఎత్తి పోతల పథకాలకు నీటి విడుదల చేస్తున్న అధికారులు.

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. 6 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తివేత, ఇన్ ఫ్లో. 1,33,133 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,33,133 క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 588 అడుగులు, పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 312 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 306 టీఎంసీలు,

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 30 వరద గేట్లు ఎత్తివేత, ఇన్ ఫ్లో 1,78,250 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1, 90,928 క్యూసెక్కులు, పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు,ప్రస్తుతం 1090 అడుగులు, నీటి సామర్థ్యం 90టీఎంసీలు, ప్రస్తుతం 89 టీఎంసీలు

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద. 9 గేట్ల ఎత్తివేశారు. ఇన్ ఫ్లో 70, 000 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 88, 000 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు, ప్రస్తుతం 1404.20 అడుగులు, నీటి సామర్థ్యం 17.802 టీఎంసీలు, ప్రస్తుతం 16.646 టీఎంసీలుగా కొనసాగుతుంది.

నిర్మల్ జిల్లా బైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ కు ఇన్ ఫ్లో.. రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టం 358.70 మీటర్లు, ప్రస్తుత నీటి మట్టం 358.70 మీటర్లు, ఇన్ ఫ్లో: 20000 క్యూ సెక్కులు, అవుట్ ఫ్లో : 20000 క్యూ సెక్కులు

నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఒక్క గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసారు అధికారులు. ప్రస్తుత ఇన్ ఫ్లో 5వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 5వేల సీఎస్‌ కొనసాగుతుంది.

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో కొనసాగుతుంది. మూడు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేసిన అధికారులు. ఇన్ ఫ్లో 32198 c/s కాగా.. ఔట్ ఫ్లో.:26068 c/s కొనసాగుతుంది. నీటి మట్టం 692.725/700 ఫీట్లు కొనసాగుతుంది. నీటి సామర్ధ్యం 5.843/7.603 TMCలుగా కొనసాగుతుంది.

నల్లగొండ జిల్లా మూసీ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ 5 గేట్లను 3 ఫీట్ల మేర పైకి ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో : 9237 క్యూసెక్కులు. అవుట్ ఫ్లో : 8075 క్యూసెక్కులు. పూర్తి స్థాయి సామర్థ్యం 645 అడుగులు. ప్రస్తుత సామర్థ్యం 642 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 3.89 టీఎంసీలుగా కొనసాగుతుంది.

ఏపీలో కొనసాగుతున్న నీటి ఎద్దడి.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు

కర్నూలు జిల్లా సుంకేసుల ప్రాజెక్టుకు వరద తగ్గింది. ఇన్ ఫ్లో 54,087 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 52,832 క్యూసెక్కులు. దీంతో.. 13 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేసారు అధికారులు. కెసి కాలువకు 1,255 క్యూసెక్కుల నీటి విడుదల చేసారు. డ్యాం పూర్తి సామర్థ్యం 1.2 టిఎంసి ప్రస్తుత సామర్థ్యం. 0.782 టిఎంసిలు కొనసాగుతుంది.

నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. జలాశయం 6 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల చేసారు అధికారులు. ఇన్ ఫ్లో : 2,80,349 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో : 2,27,325 క్యూసెక్కులు, పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం నీటి మట్టం 884.90 అడుగులు. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు, ప్రస్తుతం నీటి మట్టం 215.3263 టీఎంసీలు. కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది.

తూర్పుగోదావరి జిల్లా మళ్లీ గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుంది. ఉపనదులు ప్రాణ హిత, ఇంద్రావతి నుంచి వరద నీరు గోదావరికి చేరుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 9.30 అడుగులకు చేరిన నీటిమట్టం. బ్యారేజీ 175   గేట్లను మీటర్ పైకి ఎత్తి 3,86,892 క్యూసెక్కులు వరదనీరు సముద్రంలోకి విడుదల చేసారు. వ్యవసాయ అవసరాలకు తూర్పుడెల్టాకు 800, మధ్య డెల్టాకు 800, పశ్చిమడెల్టాకు 1000 క్యూసెక్కులు చొప్పున నీటిని విడుదల చేసిన అధికారులు.

విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద తగ్గిన వరద. మొదటి ప్రమాద హెచ్చరిక రద్దు చేశారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 2,31,190 క్యూ సెక్యులు, సర్ప్లేస్ 2,24,140 క్యూ సెక్యులు, కెనాల్స్ కు 7,050 క్యూ సెక్యులుగా కొనసాగుతుంది.

నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికివరద ఉదృతి కొనసాగుతుంది. 7 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు. ఇన్ ఫ్లో 42213 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 60,453 క్యూసెక్కులు, జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు, ప్రస్తుత నీటిమట్టం 70 టీఎంసీలుగా కొనసాగుతుంది.

కర్నూలు జిల్లా తుంగభద్ర జలాశయానికి వరద కొనసాగుతుంది. 10 గేట్ల ద్వారా దిగవ కు నీటి విడదల చేసారు అధికారులు. పూర్తి స్థాయి నీటి మట్టం 1633, ప్రస్తుతం నీటి మట్టం:1632.72 అడుగులు, ఇన్ ఫ్లో 48,539 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 33,203 క్యూ సెక్కులు, పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు, ప్రస్తుతం నీటి నిల్వ 104.664 టీఎంసీలుగా కొనసాగుతుంది.