NTV Telugu Site icon

తిరుపతిలోని శ్రీ కృష్ణా నగర్ లో వింత ఘటన

తిరుపతిలోని శ్రీ కృష్ణా నగర్ లో వింత ఘటన చోటుచేసుకుంది. భూమిలో నుంచి పైకి వచ్చింది 25 అడుగుల తాగు నీటి వాటర్ ట్యాంక్.18 సిమెంట్ ఒరలతో భూమిలో నిర్మించారు వాటర్ ట్యాంక్. భూమి లోపల దిగి మహిళ ట్యాంక్ ను శుభ్రం చేస్తుండగా ఘటన జరిగింది. ట్యాంకు పరిశీలించారు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. భయపడి ట్యాంక్ నుంచి బయట పడింది మహిళ. దీంతో ఆ మహిళకు గాయాలయ్యాయి.

ఇప్పటికీ భూమిపై నుంచి పైకి వచ్చి నిటారుగా నిలిచి ఉంది వాటర్ ట్యాంక్. ఈ వింతను చూసేందుకు ఘటనా స్థలానికి వస్తున్నారు స్థానికులు. దీంతో గత వారం రోజులుగా కురిసిన వర్షాలకు నీళ్లలో మునిగిన వాటర్ ట్యాంక్ బయటకు వచ్చి వుంటుందని స్థానికులు భావిస్తున్నారు.