Site icon NTV Telugu

శరవేగంగా పులిచింతల ప్రాజెక్టు గేటు మరమ్మతు పనులు

పులిచింతల ప్రాజెక్టు వద్ద మరమ్మతులు కొనసాగుతున్నాయి. ఊడిపోయిన పదహారో గేట్ దగ్గర మరమ్మతు పనులు కొనసాగుతున్నాయ్‌. సాగర్, తుపాకులగూడెం, పోలవరం నుంచి వచ్చిన నిపుణుల బృందం ప్రాజెక్ట్ వద్ద స్టాప్‌ లాక్ గేట్ అమర్చే పనిలో నిమగ్నమయ్యారు. స్టాప్‌ లాక్‌ ఏర్పాటులో భాగంగా ఒక ట్రయల్‌ వేయగా అది విజయవంతమైంది. దాదాపు 45 టీఎంసీల నీరు ఉండే ప్రాజెక్టును ఖాళీ చేశారు. డ్యామ్‌ నీటి మట్టం 6.5 టీఎంసీలకు తగ్గిపోయింది.
పదహారో గేటు స్పియర్‌ బేస్‌తో సహా కొట్టుకుపోవడంతో కొత్త గేటును అమర్చడం కష్టమే అని చెబుతున్నారు డ్యామ్‌ అధికారులు. ఎగువ నుంచి పూర్తిగా వరద ఉధృతి తగ్గడంతో విరిగిపోయిన 16వ నెంబర్ గేటు స్థానంలో తాత్కాలికంగా స్టాప్‌లాక్స్‌తో నీటికి అడ్డుకట్ట వేయనున్నారు.

read aslo : ప్రాణం తీసిన రమ్మీ..కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య

సాయంత్రంలోపు స్టాప్ లాక్‌ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు అధికారులు.ఈ గేటును అమర్చితే మూడు రోజులుగా వృథాగా సముద్రం పాలవుతున్న నీటిని నిలిపివేసే అవకాశముంది.
మరోవైపు నిండుకుండలా ఉన్న పులిచింతల ప్రాజెక్టును ఖాళీ చేయడంతో తిరిగి సాగర్‌నీళ్లతో నింపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు అధికారులు. పులిచింతల ప్రాజెక్టును మళ్లీ నీళ్లతో నింపుతామని రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదంటున్నారు. మొత్తానికి పులిచింతల ప్రాజెక్టు గేటు మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయి.

Exit mobile version