Ramgopal varma Visit Mla House: వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. సంక్రాంతి కోడి పందాల జోరు కొనసాగుతున్న వేళ ఆయన కాకినాడలో సందడి చేశారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చారు రాంగోపాల్ వర్మ. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నటుడు నాగబాబు వ్యాఖ్యలు పై స్పందించడానికి నిరాకరించారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. నాగ బాబు ఏం మాట్లాడారో వినలేదు.. నాగబాబు కామెంట్స్ చూసి స్పందిస్తాను.. ఫ్రెండ్స్ పిలిస్తే ఇక్కడి వచ్చాను..అంతే అన్నారు రాంగోపాల్ వర్మ.వలసపాక లో కోడిపందాలు వీక్షించారు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ
నా జీవితంలో మొట్ట మొదటి సారి ఆంధ్రాలో పబ్లిక్ గా ప్రజలతో సంక్రాంతి సంబరాలలో పాల్గొనబోతున్నాను..దీని వెనుక ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని నన్ను ద్వేషించే పార్టీ మీద ఒట్టేసి చెప్తున్నాను అంటూ పండుగకు ముందే ఆయన ట్వీట్ చేశారు.
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబుతీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. రాంగోపాల్ వర్మ అనే వాడు పెద్ద ఎదవ అని.. నీచ్, కమీనే, కుత్తేగాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గురించి, కాపు సామాజిక వర్గం గురించి ట్విట్టర్ వేదికగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోన్న రాంగోపాల్ వర్మపై నాగబాబు ఈ విధంగా మండిపడ్డారు. తాను కులాన్ని గౌరవిస్తానని, కానీ తనకు కుల పిచ్చి లేదని అన్నారు.రాంగోపాల్ వర్మ అనే వాడు పెద్ద ఎదవ. అలాంటి సన్నాసి.. నీచ్, కమీనే, కుత్తేగాడు ఇండస్ట్రీలో లేడు. వాడు అవసరం కోసం ఎంత నీచానికైనా దిగజారుతాడు.
కాబట్టి వాడి గురించి నేను మాట్లాడను. నేను కాపు సామాజికవర్గంలో పుట్టాను.. కులాన్ని గౌరవిస్తాను.. కులపిచ్చి లేదు. కాపు కులాన్ని ఎంత గౌరవిస్తానో అన్ని కులాలను అంతే గౌరవిస్తాను. కానీ, ఒక కులాన్ని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడితే అతి చాలా పెద్ద తప్పు. చాలా మంది మాట్లాడుతున్నారు. కాపు కులమే కాదు.. ఏ కులమైనా ఎందుకు అమ్ముడుపోతుంది? అంత ఆత్మాభిమానం లేకుండా బతుకుతున్నారా ప్రజలు? అంటే మనుషుల్ని ఎంత చులకనగా చూస్తున్నారో దీన్ని బట్టి అర్థమవుతోంది’’ అని నాగబాబు కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా వర్మ కూడా నాగబాబు గురించి ఇప్పుడు మాట్లాడనన్నారు. తర్వాత ఏం కామెంట్ చేస్తారో, ఎలాంటి ట్వీట్ చేస్తారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.