Site icon NTV Telugu

Ramayapatnam Port Foundation Laying Ceremony Live: రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన లైవ్‌ అప్‌డేట్స్

Ramayapatnam Port Foundatio

Ramayapatnam Port Foundatio

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటిస్తున్నారు.. గుడ్లూరు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నారు..

The liveblog has ended.
  • 20 Jul 2022 01:37 PM (IST)

    75 శాతం ఉద్యోగాలు స్థానికులకే..

    రాష్ట్రాలు అభివృద్ధి జరగాలంటే పోర్టులు ఉండటం ఓ వరం అన్నారు సీఎం వైఎస్‌ జగన్.. ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతంలో ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని ఓ చట్టాన్ని కూడా తీసుకు వచ్చాం.. రాష్ట్రంలో మొత్తం ఆరు పోర్టులు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.. ఈ ఆరు పోర్టులు కాక మరో నాలుగు పోర్టులు నిర్మించబోతున్నాం.. ఇవికాక మరో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మించబోతున్నాం.. త్వరలో మిగిలిన పార్టీలకు కూడా భూమి పూజా కార్యక్రమాలు చేస్తాం.. ఏపీ లో ప్రతీ యాభై కిలోమీటర్లకు ఓ పోర్టు.. లేదా ఓ ఫిషింగ్ హార్బర్ కనిపించేలా ప్రణాళికలు చేస్తున్నాం అన్నారు.. కొత్త పోర్టులు ద్వారా లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు సీఎం జగన్.

  • 20 Jul 2022 01:02 PM (IST)

    రైతులకు సీఎం ధన్యవాదాలు.

    రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు సీఎం వైఎస్‌ జగన్.. రాబోయే దశాబ్ద కాలంలో ఈ ప్రాంత రూపు రేఖలు మారతాయి.. పోర్టుకు అనుసంధానంగా పారిశ్రామిక కారిడార్ కూడా తీసుకు వస్తాం.. పోర్టుకు అనుసంధానంగా బైపాస్ రోడ్డుల నిర్మాణం చేస్తాం.. కందుకూరు మునిసిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తాం.. రాళ్ళపాడు ఎడమ కాలువ ఆధునికీకరణ పనులు త్వరలో చేపడతామని తెలిపారు.. ప్రాజెక్ట్ కు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు సీఎం జగన్.

  • 20 Jul 2022 01:01 PM (IST)

    పోర్టు కోసం భూముల కోల్పోయిన రైతులకు పునరావాస పత్రాలు

    రామాయపట్నం పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా పోర్టు కోసం భూముల కోల్పోయిన రైతులకు పునరావాస పత్రాలు అందించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి

  • 20 Jul 2022 12:35 PM (IST)

    లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..

    రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. పోర్టుల ద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు.. ఒక్కో పోర్టులో నేరుగా 2 వేల నుంచి 3 వేల ఉద్యోగాలు వస్తాయని.. వీటి ద్వారా అభివృద్ధి జరిగి.. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు సీఎం వైఎస్‌ జగన్.

  • 20 Jul 2022 11:38 AM (IST)

    ఏపీ మారిటైమ్ బోర్డ్ విజన్‌ను ఆవిష్కరించిన సీఎం జగన్

    గుడ్లూరు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నం పోర్టు నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఏపీ మారిటైమ్ బోర్డ్ విజన్ ను ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడనున్నారు.

  • 20 Jul 2022 11:32 AM (IST)

    రామాయపట్నం పోర్టు చేరుకున్న సీఎం జగన్

    రామాయపట్నం పోర్టు చేరుకున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. నిర్మాణ పనులకు భూమి పూజలు చేశారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు అమర్‌నాథ్, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

  • 20 Jul 2022 11:30 AM (IST)

    40 వేల మందికి ఉపాధి

    రామాయపట్నం ఓడ రేవు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 40 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు అధికారులు

  • 20 Jul 2022 11:29 AM (IST)

    రూ.10,640 కోట్ల వ్యయంతో రామాయపట్నం ఓడ రేవు నిర్మాణం..

    రామాయపట్నం ఓడ రేవును రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్‌లతో నిర్మించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.. అందులో భాగంగా తొలిదశలో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారు.. మొదటి దశలో నాలుగు బెర్త్‌లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లను పిలిచారు.. రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్టియం దక్కించుకున్నాయి. మరోవైపు, రెండో దశలో రూ.6,904 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు.. మొదటి దశలో 24.91 మిలియన్‌ టన్నులు, రెండో దశలో 113.63 మిలియన్‌ టన్నుల కార్గోతో కలిపి మొత్తం 138.54 మిలియన్‌ టన్నుల కార్గో సామర్థ్యం అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పెట్టుకున్నారు..

  • 20 Jul 2022 11:01 AM (IST)

    రామాయపట్నం పోర్టు నిర్మాణ కోసం భూమిపూజ

    నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మొండివారిపాలెంలో రామాయపట్నం పోర్టు నిర్మాణ కోసం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం వైఎస్‌ జగన్.. సంప్రదాయబద్ధంగా జలపూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు

Exit mobile version