Site icon NTV Telugu

ఏపీ ప్ర‌భుత్వంపై రామ్ మాధవ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు !

ఏపీ ప్ర‌భుత్వంపై బీజేపీ సీనియ‌ర్ నేత రామ్ మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో ది హిందుత్వ ప్యారడిం పుస్తకాన్ని ఆవిష్క‌రించారు. ఈ పుస్తక ఆవిష్క‌ర‌ణ‌లో రామ్ మాధ‌వ్.. ఏపీ స‌ర్కార్ ను టార్గెట్ చేశారు. 150 సీట్లు వచ్చాయి కదా అని బలప్రయోగం చేయకూడదని… 150 అనేది కేవలం గెలవడానికి ఉపయోగపడే ఒక నెంబర్ మాత్రమేన‌ని చుర‌క‌లు అంటించారు. గెలిచాక ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య పాలన జరగాలని సూచ‌న‌లు చేశారు.

https://ntvtelugu.com/cm-kcr-wishes-the-people-of-telangana/


పవర్ వచ్చింది కదా అని హోటల్ కు వెళ్లి తన్నడం ప్రజాస్వామ్యం కాదని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ సైతం నిజమైన హిందువున‌ని చెప్తున్నారని…శశి థరూర్ కూడా హిందుత్వ మీద మాట్లాడుతున్నారని చుర‌క‌లు అంటించారు. రెండో ప్రపంచ యుద్ధం తరవాత వ్యవస్థలు నిర్మాణం జరిగిందని.. ఇందిరా ఎమర్జెన్సీ సమయంలో మాత్రమే వ్యవస్థలు మన దేశంలో కొనసాగించలేదన్నారు.

Exit mobile version