NTV Telugu Site icon

Rains-Trains: వర్షాల ప్రభావం.. రేపటి వరకు పలు రైళ్ల రద్దు

rains-trains

rains-trains

తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. రేపటి వరకు పలు రైళ్లను రద్దు చేసింది. క్యాన్సిల్‌ అయిన లిస్టులో ఉన్న ట్రైన్ల వివరాలు.. 1. సికింద్రాబాద్‌-ఉందానగర్‌-సికింద్రాబాద్‌ ప్యాసింజర్‌ 2. సికింద్రాబాద్‌-ఉందానగర్‌ మెము 3. మేడ్చల్‌-ఉందానగర్‌ మెము స్పెషల్‌ 4. ఉందానగర్‌-సికింద్రాబాద్‌ మెము స్పెషల్‌ 5. సికింద్రాబాద్‌-ఉందానగర్‌ మెమె స్పెషల్‌ 6. హెచ్‌ఎస్‌ నాందేడ్‌-మేడ్చల్‌-హెచ్‌ఎస్‌ నాందేడ్‌ 7. సికింద్రాబాద్‌-మేడ్చల్‌ మెము 8. మేడ్చల్‌-సికింద్రాబాద్‌ మెము 9. కాకినాడ-విశాఖపట్నం మెము 10. విజయవాడ-బిట్రగుంట మెము.

వీటితోపాటు 34 ఎంఎంటీఎస్‌ సర్వీసులు కూడా రద్దయ్యాయి. లింగంపల్లి-హైదరాబాద్‌ మార్గంలో 9 సర్వీసులు, హైదరాబాద్‌-లింగంపల్లి మార్గంలో 9, ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య 7, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య 7, సికింద్రాబాద్‌-లింగంపల్లి మధ్య 1, లింగంపల్లి-సికింద్రాబాద్‌ మధ్య ఒక సర్వీసు క్యాన్సిల్‌ అయ్యాయి. రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు ఉంటే తాజా సమాచారాన్ని ప్రయాణికులకు రైల్వే స్టేషన్లలో నిరంతరం ప్రకటించేలా చర్యలు చేపట్టాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అధికారులకు సూచించారు. వర్షాల నేపథ్యంలో రైల్వే ట్రాక్‌ల నిర్వహణకు సంబంధించిన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.