Site icon NTV Telugu

Rains Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్..!

Rains Update

Rains Update

Rains Update: తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా వర్షాలు తగ్గాయి. 16 నుంచి వాతావరణంలో మార్పులు రావడం.. పగలు, రాత్రి అనక వర్షాలు, వడగండ్ల వానలు పడటంతో రెండు రాష్ట్రాల్లో వాతావరణ ఉక్కపోత నుండి కాస్త ఉపసమనం లభించింది. అయితే రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కాగా.. తెలంగాణలో మళ్లీ మార్చి 24, 25 తేదీల్లో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. కాగా.. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్‌ వరకు విస్తరించింది. దీని ప్రభావమే రాష్ట్రంలోని పలుచోట్ల అక్కడక్కడా ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. పగలు, రాత్రి ఉష్టోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది.

తెలంగాణలో వాతావరణ స్థితి..
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. కాగా.. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతాయని చెప్పారు. అంతే కాకుండా.. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. చలి విషయంలో రాష్ట్రం మొత్తం సాధారణ ఉష్ణోగ్రతలే ఉండనున్నాయని తెలిపారు.

ఏపీలో వర్షాలు..
ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. ఇవాళ కూడా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులకు అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఇక..కొన్ని చోట్ల వర్షం సంభవించే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు..దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. దీని ప్రభావంతో.. ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపారు.
Ugadi wishes: ‘శోభకృత్‌’లో శుభాలు కలగాలి.. రాజకీయ, సినీ ప్రముఖులు ఉగాది శుభాకాంక్షలు

Exit mobile version