Site icon NTV Telugu

బద్వేల్‌ కలసపాడులో భారీ వర్షం.. విధుల్లో పోలింగ్ సిబ్బంది

కడప జిల్లా బద్వేల్‌లో శనివారం పోలింగ్ జరగనుంది. ఇదిలా వుంటే బద్వేల్‌ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడింది. దీంతో బద్వేల్ ఉపఎన్నిక చల్లటి వాతావరణంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు, ఇతర అధికార సిబ్బంది. వర్షం కురుస్తున్నా పోలీస్ వాళ్ళు విధుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు మరికొద్ది గంటల్లో జరిగే బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్దం చేసింది అధికారయంత్రాంగం.

బద్వేల్ ఉపఎన్నిక లో మొత్తం 281 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేశారు. 148 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించామని అధికారులు తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. పోలింగ్ విధుల్లో పారా మిలిటరీ ఫోర్స్ బలగాలు ఈ ప్రాంతానికి చేరుకున్నాయని బద్వేల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ తెలిపారు. 15 కంపెనీల సెంట్రల్ ఫోర్స్ , అదనపు బల గాలే కాకుండా 2 వేల మందితో పోలీసు బందో బస్తు చేస్తున్నట్లుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ తెలిపారు.

Exit mobile version