NTV Telugu Site icon

Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.. ఏపీలో వర్షాలు..

Rains Alert

Rains Alert

Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు కురవబోతున్నాయి.. రేపటి నుంచి ఏపీలో మోసర్తు వర్షాలు కురవబోతున్నాయి.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో ఈ వర్షాలు కురబోతున్నాయి.. ఇక, ఉపరితల ఆవర్తనం మరింత బలపడి.. ఈ నెల 31న వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో.. రేపటి నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని.. ఈ నెల 30, 31 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.. అయితే, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుందని.. పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈ నెల 31 నాటికి వాయుగుండంగా మారనుందని అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు.. ఇక, ఫిబ్రవరి 1వ తేదీ నాటికి శ్రీలంకకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందంటున్నారు.. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా నమోదయ్యే అవకాశం ఉంది.. మరోవైపు, ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమిస్తాయి కనుక వర్షాలు పడవని.. చాలా అరుదుగా చెబుతున్నారు. సముద్రంపై తేమ ఎక్కువగా ఉండడంతో ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలకు ఛాన్స్ ఉంటుందంటున్నారు వాతావరణశాఖ అధికారులు.

Read Also: Cow Dung to Produce Biogas: ఆవు పేడే ఇంధనం..! త్వరలో రోడ్డెక్కనున్న కొత్త కార్లు