అలర్ట్ : మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

rain

rain

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతము ఈశాన్య & దానిని ఆనుకుని వున్న తూర్పు మధ్య బంగాళాఖాతం లలో సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ వరకు విస్తరించి ఎత్తుకు వెళ్ళే కొలది నైఋతి దిశ వైపుకు వంగి కొనసాగుతున్నది. దీని ప్రభావం వలన రాగల 48 గంటలలో ఉత్తర & దానిని ఆనుకుని వున్న మధ్య బంగళాఖాతం లలో ఒక “అల్ప పీడనం” ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు షీర్ జోన్ (ద్రోణీి) 12°N అక్షాంశము వెంబడి సగటు సముద్రమట్టానికి 5.8 km నుండి 7.6 km ఎత్తుల మధ్య కొనసాగుతున్నది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 1.5 km నుండి 4.5 km ఎత్తుల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణం వైపు వంగి ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు బలహీనపడింది. వీటి ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు ఉన్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.