ఏపీకి భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. నైరుతి ఋతుపవనాల ఉత్తర పరిమితి బార్మర్, భిల్వారా, ధోల్పూర్, అలీఘడ్, మీరట్, అంబాలా మరియు అమృతసర్ గుండా వెళుతుం దని పేర్కొన్న వాతావరణ శాఖ.. దక్షిణ ఒడిశా & పరిసరాలపై ఇతర ఉపరితల ఆవర్తనము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ & తీరప్రాంత పరిసరాల మరియు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందని తెలిపింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ మరియు వాయువ్య దిశల నుండి గాలులు వీస్తున్నాయని తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని…భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
read also :హుజూరాబాద్ లో దళితుల ఓట్లు కోసమే కేసీఆర్ జిమ్మిక్కులు
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని… మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాయలసీమ: ఈరోజు రాయలసీమలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని మరియు భారీ వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులు తోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ.
