Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఏపీలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా రాహుల్‌కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కేవీపీ, శైలజానాథ్, రఘువీరారెడ్డి, సుబ్బరామిరెడ్డి, తులసిరెడ్డి, రుద్రరాజు, కనుమూరి బాపిరాజు సహా పలువురు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు పాల్గొన్నారు. ఈరోజు నుంచి ఈనెల 21 వరకు నాలుగు రోజుల పాటు 119 కిలోమీటర్ల మేర ఏపీలో రాహుల్ గాంధీ పాదయాత్ర సాగనుంది. తిరిగి ఈనెల 22న కర్ణాటకలోని రాయచూర్‌లోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది.
Read Also: ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయాలు
కాగా ఈరోజు కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర జరుగుతుంది. హాలహర్వి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. హత్తిబెలగల్, మునేకుర్తి మీదుగా రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఈరోజు రాత్రికి చాగిలో రాహుల్ గాంధీ బస చేయనున్నారు. అలాగే ఈరోజు లంచ్ బ్రేక్ సమయంలో పోలవరం నిర్వాసితులు, అమరావతి రైతులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. కాగా రాహుల్ పాదయాత్రకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.