Site icon NTV Telugu

ప్రధాని మోడీకి రఘురామ లేఖ..కారణం ఇదే

Raghu Rama

ప్రధాని మోడీకి వైసీపీ రెబల్ ఎంపి రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ ఫిషరీష్ వర్సిటీ ఏర్పాటు చేయాలని ఈ లేఖలో పేర్కొన్నారు. భీమవరం ఆక్వా సంస్కృతికి రాజధాని అని రఘురామకృష్ణరాజు తెలిపారు. అంతేకాదు ఏపీ గవర్నర్ కు కూడా రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. జడ్జి రామకృష్ణను పీలేరు సబ్ జైలు నుంచి తిరుపతి ఆస్పత్రికి తరలించాలని పేర్కొన్నారు. రాజద్రోహం కేసు కారణంగా రామకృష్ణ రిమాండ్ లో ఉన్నారని, షుగర్, అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. రామకృష్ణ కు మెరుగైన వైద్యం అందించాలని రఘురామ లేఖలో పేర్కొన్నారు. కాగా.. కొన్ని రోజుల క్రితమే రఘురామ జైలు నుంచి విడుదల అయిన సంగతి తెలిసిందే.

Exit mobile version