Site icon NTV Telugu

చీప్ పబ్లిసిటీ కోసం రఘురామ ఆరాటం: విజయసాయిరెడ్డి

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందని.. జార్ఖండ్‌కు చెందిన వ్యక్తులతో తనను చంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రఘురామ ఆరోపించడంపై విజయసాయిరెడ్డి మండిపడ్డారు. గుడ్డ కాల్చి మొహాన పడేస్తే ఆ మసిని వారే తుడుచుకుంటారులే అనుకుంటున్నాడని రఘురామను ఉద్దేశించి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కూర్చుని తనను చంపేస్తారని ఏడుపు మొదలు పెట్టాడని.. నర్సాపురం ప్రజలకు తన మొహం చూపించలేకే ఇలా పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.

Read Also: ఏపీలోనూ విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు..?

చీప్ పబ్లిసిటీ కోసం అతడు ఎంతకైనా తెగిస్తాడని.. చివరకు గోదాట్లో దూకి తనను ఎవరో తోసేశారు అనే రకమని రఘురామను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు. మరోవైపు విజయనగరంలోని జేఎన్టీయూ కాలేజీకి యూనివర్సిటీ హోదా కల్పించి జగన్ ప్రభుత్వం గురజాడ అప్పారావు గారి పేరు పెట్టిందని ప్రశంసించారు. వైఎస్ఆర్ హయాంలో మంజూరైన కాలేజీ ఇప్పుడు యూనివర్సిటీగా మారిందన్నాడు. ప్రతి జిల్లాలో యూనివర్సిటీ ఉండాలని… పేదలందరూ పెద్ద చదువులు చదవాలన్న పెద్దాయన కల సాకారమైందని విజయసాయిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

Exit mobile version