NTV Telugu Site icon

Python: హాస్టల్‌ లో కొండ చిలువ కలకలం.. భయాందోళనలో విద్యార్థులు

Untitled 3

Untitled 3

YSR District: ఈ ప్రంపంచంలో దాదాపు 3 వేలకు పైగా పాము జాతులు ఉన్నాయి. అయితే వాటిలో దాదాపు 600 జాతులు విషపూరితం అయినవి. కాగా కేవలం 200 జాతుల పాములు మాత్రమే మనిషి ప్రాణాలకు ప్రమాదం కలిగించగలవు. అయితే మనం ఏ పామును చూసిన వణికిపోతాం. అది చిన్న పాము అయినా సరే మనకు చమటలు పడతాయి. అలాంటిది కొండచిలువ మనం పడుకునే మంచం కింద ఉంటే.. ఆ ఊహ కూడా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే కొండచిలువ విషపూరితమైన పాము కాదు.. కానీ అది ఎలాంటి జీవినైనా గట్టిగ చుట్టుకుని ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఆ తరువాత ఆ ప్రాణిని మింగేస్తుంది. అందుకే కొండచిలువలను దూరం నుండి చూడడానికి కూడా మనుషులు భయపడతారు.

Read also:Amitabh Bachchan: ప్లీజ్ అమితాబ్‌ జీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు రావొద్దు..

అలాంటిది ఓ పెద్ద కొండచిలువ పిల్లలు పడుకునే మంచం కింద పడుకునుంది. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. వైఎస్ఆర్ జిల్లా లోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లోని బాయ్స్ హాస్టల్ లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఓ విద్యార్థి మంచం కింద చుట్ట చుట్టుకుని ఉన్న కొండచిలువను గుర్తించారు విద్యార్థులు. దీనితో కొండచిలువను చూసిన విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. బ్రతుకు జీవుడా అంటూ ప్రాణాలు అరచేత పట్టుకుని అక్కడ నుండి పరుగురు తీసిన విద్యార్థులు ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే యాజమాన్యం అటవీశాఖ అధికారులకు సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది హుటాహుటీన ఘటన స్థలానికి చేరుకొని కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం ఆ కొండచిలువను తీసుకెళ్లి అడవిలో వదిలేశారు అధికారులు. కాగా ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు, దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా హాస్టల్ లోకి కొండచిలువ ఎప్పుడు వచ్చింది.. ఎలా వచ్చింది అనేది మాత్రం మిస్టరీగ మారింది.

Show comments