Site icon NTV Telugu

Violence In Court: కోర్టు ఆవరణలోనే లాయర్పై హత్యాయత్నం.. ఉద్రిక్తంగా మారిన విడాకుల కేసు!

Ctr

Ctr

Violence In Court: తిరుపతి జిల్లా పుత్తూరులో విడాకుల కేసు వివాదం హత్యాయత్నం స్థాయికి చేరింది. కోర్టు పరిధిలో న్యాయవాదిపై కారు దూసుకెళ్లిన ఘటన స్థానికంగా సంచలనం రేపుతుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, తిరుపతి పట్టణంలోని భవాని నగర్‌కు చెందిన ఏ. రాజశేఖర్‌ అనే లాయర్ ఫిర్యాదుతో రామచంద్రాపురం మండలం నదవలూరు గ్రామానికి చెందిన సాయి ప్రసాద్‌ రెడ్డిపై పుత్తూరు పోలీసులు కేసు ఫైల్ చేశారు. సాయి ప్రసాద్‌ తన భార్య హేమలతతో పరస్పర ఒప్పందం ప్రకారం విడాకుల కోసం పుత్తూరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

Read Also: Deputy CM Pawan: నేడు పలమనేరులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన..

అయితే, ఫిర్యాదులో హేమలత తరఫున న్యాయవాదిగా వ్యవహరిస్తున్న రాజశేఖర్‌ గత నాలుగు నెలలుగా కేసు పరిష్కారం కాకుండా ఆలస్యం చేస్తున్నారని సాయి ప్రసాద్‌ తీవ్ర అసహనానికి గురయ్యాడు. ఈ క్రమంలో, నిన్న పుత్తూరు కోర్టు పరిధిలో లాయర్ రాజశేఖర్‌పైకి తన కారును ఉద్దేశపూర్వకంగా దూసుకెళ్లి చంపడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ అతడు తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. ఇక, ఈ ఘటనపై పుత్తూరు పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కేసు ఫైల్ కావడంతో.. భారత న్యాయ సవరణ చట్టంలోని 109(1), 351(2) సెక్షన్ల కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడు సాయి ప్రసాద్‌ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Exit mobile version