Site icon NTV Telugu

Punith Rajkumar: తెనాలిలో ఆకట్టుకుంటోన్న పునీత్ రాజ్‌కుమార్ 21 అడుగుల విగ్రహం

Punith Rajkumar

Punith Rajkumar

Punith Rajkumar: దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అలియాస్ అప్పూ ఈ లోకాన్ని విడిచిపోయి నేటికి (అక్టోబర్‌ 29) ఏడాది గడిచిపోయింది. అప్పూ ప్రస్తుతం లేడన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు సినిమాలు.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ పునీత్ అశేష అభిమానులను సొంతం చేసుకున్నాడు. పిన్న వయసులోనే గుండెపోటుకు గురై ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయాడు. ఈ నేపథ్యంలో పునీత్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు.

Read Also: Pawan Kalyan: ప్రజాస్వామ్యంలో నియంత పోకడలు చెల్లవు.. రౌడీలు రాజ్యాలు ఏలకూడదు..!!

కాగా పునీత్‌కు కన్నడతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగునాట ఆయనకు అశేష అభిమానగణం ఉంది. ఈ నేపథ్యంలో పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే బెంగళూరులో తరలించనున్న ఈ విగ్రహ తయారీకి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందని శిల్పులు తెలిపారు.

ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు. నవంబర్ 1న పునీత్ రాజ్ కుమార్‌ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ఈ కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథులుగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. అటు అప్పు మొదటి వర్ధంతిని పురస్కరించుకుని అభిమానులు కన్నడ నాట అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నారు. అలాగే అప్పు నటించిన గంధడ గుడి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో మొక్కలను కూడా ప్రదానం చేయనున్నారు. ఇక పునీత్‌ కుటుంబ సభ్యులు కంఠీరవ స్టేడియంలోని అప్పు సమాధిని దర్శించుకుని నివాళులర్పించారు.

Exit mobile version