Site icon NTV Telugu

Minister ParthaSarathy: వైసీపీ గెలిస్తేనే.. ప్రజాస్వామ్యాం ఉన్నట్టా..!

Parthasaaarathy

Parthasaaarathy

Minister ParthaSarathy: రాష్ట్రంలో వర్షాలు, వరదలతో పాటు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికినకైనా ప్రభుత్వం రెడీగా ఉందని మంత్రి పార్థసారధి తెలిపారు. ఇక, పులివెందుల, ఒంటిమిట్టలలో గెలుపు ఉత్సాహం నింపింది.. వైసీపీ గెలిస్తేనే ప్రజాస్వామ్యం ఉన్నట్టా అని ప్రశ్నించారు. పులివెందులలో ప్రజాస్వామ్యంపై జగన్ ఆలోచించుకోవాలి.. 30 ఏళ్ల తర్వాత ప్రజలు పులివెందులలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ అనవసరంగా మాట్లాడుతున్నారు.. ఎన్ని శాపాలు పెట్టిన చంద్రబాబుకు ఏం కాదు.. భగవంతుని ఆశీర్వాదం ఉందని కొనియాడారు. పులివెందులలో నేను కూడా పని చేశా.. 50, 60 ఇళ్లలో ప్రచారం చేశా.. వైసీపీ సానుభూతిపరుల ఇంటికి కూడా వెళ్ళాము.. బలహీన వర్గాల ఇళ్లకు కూడా వెళ్ళాం.. మార్పును బలంగా కోరుకుంటున్నారని మంత్రి పార్థసారధి వెల్లడించారు.

Read Also: Pakistan Rocket Force: పాక్ సైనిక దళంలోకి కొత్త ఫోర్స్.. భారత్‌ను దృష్టిలో పెట్టుకొనేనా..?

ఇక, పులివెందుల మార్పు కోరుకున్నారు.. 2029కి ఈ విజయం తొలిమెట్టు అని మంత్రి పార్థసారధి చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే కేంద్ర బలగాలు వస్తాయి.. లోకల్ బాడీస్ కు కేంద్ర బలగాలు రావు.. నేను ఎప్పుడూ చూడలేదు.. పులివెందులలో ఎన్నికలను బహిష్కరించండి అని పిలుపు ఇచ్చినా 60 శాతం పోలింగ్ జరిగింది…
సీఎం చంద్రబాబు తాపత్రయం వల్ల పులివెందులలో గెలిచాం.. చంద్రబాబు. రాహుల్ గాంధీ హాట్ లైన్ లో ఉన్నట్టు జగన్ చూశారా.. లేకపోతే ఫోన్లు టాప్ చేసారా.. అయినా, జగన్ కు టాపింగ్ అలవాటు ఉంది.. మరి చేసారేమో అని మంత్రి పార్థసారధి అనుమానం వ్యక్తం చేశారు.

Exit mobile version