PSLV C-56 Rocket: PSLV C-56 రాకెట్ ప్రయోగం సక్సెస్.. 7 ఉపగ్రహాల్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PSLV C-56 Rocket Launched Successfully: ఇస్రో చేపట్టిన PSLV C-56 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. మొత్తం నాలుగు దశల్లో ఈ ప్రయోగం చేపట్టిన ఇస్రో.. సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో.. శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్లో శాస్త్రవేత్తల సంబరాలు జరుపుకున్నారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న సిబ్బందిని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అభినందించారు. ఒకే నెలలో ఇస్రో రెండు ప్రయోగాలను (చంద్రయాన్3, PSLV C-56) విజయవంతం చేసింది.
Whats Today: ఈరోజు ఏమున్నాయంటే..?
Also Read
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
ఇది పూర్తిగా వాణిజ్య ప్రయోగం. సింగపూర్ డిఫెన్స్ సైన్స్ & టెక్నాలజీ ఏజెన్సీ, ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన 360 కిలోల DS-SAR ఉపగ్రహాన్ని ప్రాథమిక పేలోడ్గా PSLV C-56 తీసుకెళ్లింది. 5 డిగ్రీల వంపులో, 535 కిలోమీటర్ల ఎత్తులో.. నియర్-ఈక్వటోరియల్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. అయితే.. మొత్తం బరువు 228.64 టన్నులు కాగా, 7 ఉపగ్రహాల బరువు 442 కిలోలు. అధునాతన సాంకేతికతతో తయారు చేసిన DS-SAR ఉపగ్రహం.. అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లో కవరేజీని అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ DS-SARతో పాటు టెక్నాలజీ డెమాన్ స్ట్రేషన్ మైక్రో శాటిలైట్ వెలాక్స్-AM, ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్ ARCADE, 3U నానోశాటిలైట్ స్కూబ్-2, IoT కనెక్టివిటీ నానోశాటిలైట్ నూలయన్, గెలాసియా-2, ORB-12 స్ట్రైడర్ శాటిలైట్లను ఇస్రో రోదసిలోకి పంపింది.
Eye Twitching: కళ్లకలక ఎందుకు వస్తుందో తెలుసా..? ఈ ఇన్ఫెక్షన్ వస్తే పాటించాల్సినవి ఇవే..?
PSLV C-55 మాదిరిగానే PSLV C-56ని మిషన్ కోర్-ఎలోన్ మోడ్‌లో ఇస్రో కాన్ఫిగర్ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదికగా.. సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి పీఎస్ఎల్వీ సీ56 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. గగన్ యాన్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. సూర్యుడుపై పరిశోధనలకు ఆదిత్య L1 ఉపగ్రహాన్ని త్వరలోనే ప్రయోగించనున్నారు.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?