Site icon NTV Telugu

తోలేరులో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే గ్రంధికి జనసేన షాక్

పశ్చిమగోదావరి జిల్లాలో ప్రోటోకాల్ రగడ నడుస్తోంది. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కి షాకిచ్చారు వీరవాసరం మండలంలోని జనసేన నేతలు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో అంగన్ వాడీ బిల్డింగ్ , సొసైటీ గౌడౌన్ ప్రారంభోత్సవం చేయాల్సి వుంది. ఈ ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ పాటించలేదు.

జనసేనకు చెందిన సర్పంచ్, జెడ్పీటీసీకి ఆహ్వానం పంపలేదు. దీంతో వైసీపీ భీమవరం ఎమ్మెల్యే రాకముందే అంగన్ వాడీ, సొసైటీ గౌడౌన్ లను ప్రారంభించారు జనసేన ZPTC గుండా జయప్రకాష్, గ్రామ సర్పంచ్ వేండ్ర లీలా వెంకట కృష్ణ. దీంతో తోలేరు గ్రామంలో ఉద్రిక్తత ఏర్పడింది.

Exit mobile version