NTV Telugu Site icon

Road Accident: దెందులూరులో హైవేపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బోల్తా

Private Travels Bus

Private Travels Bus

Road Accident: ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలో జాతీయరహదారిపై ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది.. మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి విజయనగరం వైపు ప్రయాణిస్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దెందులూరు సమీపంలో జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా కొట్టిందని స్థానికులు తెలిపారు.. ప్రమాద సమయంలో బస్సులో సుమారుగా 25 మంది ప్రయాణిస్తున్నారని తెలుస్తుండగా.. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి.. మరికొందరికి స్వల్పగాయాలు అయ్యాయి.. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు.. క్షతగాత్రులను అంబులెన్స్‌ సాయంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.. ఈ ప్రమాదంతో హైవేపై ప్రయాణికులకు ఇబ్బంది ఏర్పడగా.. దెందులూరు ఎస్ఐ వీర్రాజు నేతృత్వంలో ట్రాఫిక్ నియంత్రించడానికి బస్సును క్రెన్ ల సహాయంతో పక్కకు చేర్చారు.. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అయితే, బస్సులో ఉన్న ప్రయాణికుల వివరాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read Also: Pawan Kalyan: పోలవరం సత్వరమే పూర్తి చేయండి.. కేంద్రమే చొరవ తీసుకోవాలి..