Site icon NTV Telugu

నేడు ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్…

నేడు ఏపీలో ప్రైవేట్ విద్యాసంస్థలు బంద్ కు పిలుపునిచ్చాయి. అయితే కరోనా వైరస్ కారణంగా గత ఏడాదిన్నరగా మూసిఉన్న విద్యాసంస్థలు ఏపీలో గత నెల 16 నుండి ప్రారంభమయ్యాయి. అయితే ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై జీవో 53 విడుదల చేసింది. గ్రామ, మున్సిపాల్టీ, కార్పోరేషన్ వారీగా ఫీజులను నిర్ధారించింది ప్రభుత్వం. అయితే ఆ జీవో పై నిరసనలకు పిలుపునిచ్చారు ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వాహకులు. ఇక ఈ కరోనా సమయంలో విద్యాసంస్థలు తెరుచుకోవడంతో కొన్ని పాఠశాలలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. విద్యార్థులు, టీచర్లు ఈ వైరస్ బారిన పడుతున్న విషయం తెలిసిందే.

Exit mobile version