Minister Narayana: గత ప్రభుత్వానికి ఆర్థిక క్రమ శిక్షణ లేదు అని మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. మున్సిపల్ శాఖలో ఉన్న నిధులు గత ప్రభుత్వం డైవర్ట్ చేసింది అని ఆరోపించారు. ప్రస్తుత ఎన్డీయే కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతోంది అని తేల్చి చెప్పారు. అన్నిటి కంటే ముఖ్యంగా మున్సిపల్ శాఖకు 13 వేల కోట్ల రూపాయలకు పైగా కేటాయింపు జరిగిందని వెల్లడించారు. ఇక, సీఆర్డీఏకు 6 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.. 27,500 కోట్ల రూపాయలను పెన్షన్ కోసం కేటాయింపులు చేసినట్లు మంత్రి నారాయణ చెప్పుకొచ్చారు.
Read Also: Diplos Max Electric Scooter: మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్‌తో 140KM రేంజ్!
ఇక, ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలు జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అలాగే, వచ్చే నెల 10వ తేదీన రాజధాని టెండర్లు ఓపెన్ చేస్తాం.. అప్పటి నుంచి రాజధాని పనులు ప్రారంభం అవుతాయి.. దీంతో ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత రైతులకు మేలు జరుగుతుంది అన్నారు. అమరావతి సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్.. ఎలాంటి అప్పు లేకుండా బర్డెన్ లేకుండా రాజధాని నిర్మాణం కొనసాగుతుందని వెల్లడించారు.