Site icon NTV Telugu

AP New Cabinet : నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు

ఏపీ క్యాబినెట్‌ విస్తరణకు అడుగులు శరవేగంగా సాగుతున్నాయి. నిన్ననే ఏపీ మంత్రివర్గంలోని పలువురు మంత్రులు రాజీనామా కూడా చేశారు. ఈ నేపథ్యంలో నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఏర్పాట్లపై సీఎస్ డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులతో వర్చువల్‌గా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది.

ప్రమాణ స్వీకారం అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో నూతన మంత్రివర్గ సభ్యులతో గ్రూపు ఫోటో, వేదిక, అలంకరణ, ఆహ్వాన పత్రిక, రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులుగా డిజిగ్నేట్ కాబడిన వారికి ఆహ్వానం పలకడం, రవాణా సౌకర్యం ఏర్పాట్లను ప్రోటోకాల్ విభాగం పర్యవేక్షిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎవరెవరిని మంత్రి పదవులు వరించనున్నాయోనని ఏపీలో ఉత్కంఠ నెలకొంది.

https://ntvtelugu.com/tammineni-sitaram-fired-on-somu-veerraju/

Exit mobile version