Site icon NTV Telugu

Prakasam District: గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద.. నీటిలోనే 10 గ్రామాలు!

Pkm

Pkm

Prakasam District: తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. 14 గేట్లు ఎత్తి ప్రాజెక్టు నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు నీటిని అధికారులు దిగువకు వదిలి పెడుతున్నారు. ఒక్కసారిగా అన్ని గేట్లు ఎత్తడంతో పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. మద్దిపాడు మండలం ఇనమనమెళ్ళూరు, నందిపాడు, కొలచనకోట, వెల్లంపల్లి, మల్లవరం, తెల్లబాడు, రాచవారిపాలెం, కీర్తిపాడు, నాగన్నపాలెం గ్రామాల్లోకి గుండ్లకమ్మ నీరు చేరింది. ఇక, కొలచనకోట ఎస్టీ కాలనీలోకి వరద నీరు చేరడంతో ప్రజలను పునరావాస కేంద్రానికి అధికారులు తరలించారు. నాగులుప్పలపాడు మండలంలో చదలవాడ విద్యుత్ సబ్ స్టేషన్ లోకి సైతం నీరు వెళ్లడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

Read Also: RTC Bus Stuck: వరదలో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు.. సురక్షితంగా బయటపడిన ప్రయాణికులు

ఇక, ప్రకాశం జిల్లాలో రైతాంగాన్ని తీవ్రంగా మొంథా తుషాన్ దెబ్బ తీసింది. గాలి వాన బీభత్సానికి ఖరీఫ్ పంటలకు తీవ్ర నష్టం జరిగింది. ప్రాథమిక అంచనా ప్రకారం మొత్తం 10,274 హెక్టార్లలో సాధారణ పంటలు దెబ్బ తిన్నాయి. 870.18 హెక్టార్లలో ఉద్యాన పంటలు నష్టపోయాయి. ప్రాథమికంగా గుర్తించి ప్రభుత్వానికి వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు నివేదిక పంపించారు.

Read Also:

* బాధిత రైతులు – 12,418
* దెబ్బతిన్న పంట విస్తీర్ణం – 10,274 హెక్టార్లు..
* పత్తి – 6,577
* సజ్జ – 1,771
* వరి – 1,440
* మొక్కజొన్న – 268
* మినుము – 109
* జొన్న – 60
* ఆముదం – 26
* వేరుశనగ – 20

Exit mobile version