NTV Telugu Site icon

Swapnika: అల్లిక కళ.. స్వాప్నికకు గిన్నిస్ బుక్‌లో చోటు

Swapnika

Swapnika

Swapnika: అల్లికల కళలో ఏపీకి చెందిన స్వాప్నికకు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కింది.. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన స్వాప్నిక.. తన అమ్మమ్మ వద్ద అల్లికలను నేర్చుకొని వాటికి సంబంధించిన మెళకువలను అవలీలగా పసిగట్టి కొత్త అల్లికల గురించి ఆలోచించేది, వాటికి సంబంధించిన కొత్త రికార్డు గురించి తెలుసుకోవడం అంటే స్వాప్నికకు ఇష్టం.. క్రిస్మస్ డెకరేషన్.. మొదలైన వాటితో రికార్డ్ సృష్టించారు. ఎంఐక్యూ’ లాంటి సంస్థల రికార్డుల గురించి తెలుసుకునే క్రమంలో స్వాప్నికకు రికార్డ్ లపై ఆసక్తిమొదలైంది. ‘గిన్నిస్ బుక్ రికార్డ్’ అంటే ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ఉండాలని దృష్టి పెట్టింది. విశాఖపట్టణానికి చెందిన ‘మహిళా మనో వికాస్ క్రాఫ్స్ అండ్ క్రియేషన్’ సంస్థ క్రోచెట్సు (అల్లిక)కు సంబంధించి నిర్ణీత వ్యవధిలో అత్యధిక కళాకృతులు తయారు చేయాలని సవాలు ఇచ్చింది.

Read Also: Krithi Shetty : బేబమ్మ ఆశలన్నీ ఆ హీరో మీదనే !

ఈ సవాలుకు ‘సై’అంటూ స్వాప్నిక బృందంలోని మహిళలు అతి తక్కువ సమయంలో 58,112 క్రోచెట్ స్క్వేర్లను తయారుచేసి లార్జెస్ట్ డిస్ప్లే ఆఫ్ క్రోచెట్స్ స్వ్కేర్’ అనే టైటిల్ సొంతం చేసుకున్నారు.. దీంతో, గిన్నిస్ బుక్ రికార్డ్ నెలకొల్పారు. గిన్నిస్ రికార్డు కోసం 20 వేల క్రోచెట్స్ స్క్వేర్స్ తయారు చేయాల్సి ఉండగా స్వాప్నిక బృందం 58,112 తయారుచేసి వరల్డ్ రికార్డు సృష్టించారు.. స్వాప్నిక అల్లికలతో ఆగిపోకుండా కూచిపూడి నుంచి కరాటే వరకు నేర్చుకున్నది.. తల్లి, దండ్రుల ప్రోత్సాహంతో కూచిపూడి నేర్చుకుంది. రాష్ట్ర స్థాయిలో ఎన్నో బహుముతులు గెలుచుకుంది. కరాటేలో కూడా ప్రావీణ్యం సంపాదించింది. ఆఫార్మన్ చదివే రోజుల్లో స్వాప్నిక తన చేతులపై జీవును నడిపించుకుని సాహసవంతమైన ఫీట్ చేసింది. వృత్తిరీత్యా ఫార్మసిస్టు అయిన స్వాప్నిక ప్రవృత్తిరీత్యా ఆర్టిస్ట్. ఎప్పటికప్పుడు కొత్త కళలపై ఆసక్తి చూపుతుంటుంది.