Site icon NTV Telugu

Posani Krishna Murali : అందుకే సీఎం జగన్‌ను క‌లిసా..

సీఎం వైఎస్ జ‌గ‌న్ ను సినిమా న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళి గురువారం తాడేపల్లిలో కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మా కుటుంబం క‌రోనాతో బాధప‌డుతున్న స‌మ‌యంలో సీఎం, ఆయ‌న స‌తీమ‌ణి మాట సాయం చేశారని, ఏఐజి ఆసుప‌త్రికి ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారన్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్‌ను క‌లిసి కృత‌జ్జత‌లు తెలిపానని ఆయన వెల్లడించారు. సినిమా టికెట్ల ధరల పెంపు పై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, చిన్న సినిమాల నుండి ప్రతిపాద‌న‌లు అందా‌కే టికెట్ల ధ‌ర‌ల‌పై నిర్ణయం వ‌స్తుందన్నారు.

సీఎంతో సమావేశంలో సినిమా టికెట్ల ధ‌ర‌లపై నేను చ‌ర్చించ‌లేదని, ఆలీకి ఇచ్చిన‌ట్టే త‌న‌కు ప‌ద‌వి ఇస్తున్నారు అనడంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. భీమ్లానాయ‌క్ సినిమాకు టికెట్ల గురించి నాకు తెలియ‌దని, నేను సినిమా వాడినే గానీ దాని గురించి నాకు తెలియదన్నారు. భీమ్లానాయ‌క్ సినిమాను ప్రభుత్వం ఉద్దేశ పూర్వ‌కంగా ఇబ్బంది పెట్టార‌ని ఆరోపించడం సరికాదని, భీమ్లానాయ‌క్ సినిమాను ఉద్దేశ పూర్వకంగా ఇబ్బంది పెట్టార‌ని మీ ద‌గ్గర సాక్ష్యం ఉంటే చెప్పండి నాద‌గ్గర లేదు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

https://ntvtelugu.com/indian-embassy-issued-several-instructions/
Exit mobile version