Site icon NTV Telugu

Ponnada Sathish : రాజకీయాలకోసం నాకుటుంబాన్ని బలిపెట్టదలుచుకోలేదు..

Ponnada Sathish

Ponnada Sathish

12 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే కోనసీమ జిల్లాలోని ముమ్మిడివరంలో నిర్వహించి వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలకు ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌ హాజరయ్యారు. అయితే..ఇటీవల కోనసీమ జిల్లా పేరు మార్పుపై అమలాపురంలో అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్లీనరీ హజరైన పొన్నాడ సతీష్‌ మాట్లాడుతూ.. అమలాపురంలో జరిగిన ఘటన నుండి ఇంకా‌ కోలుకోలేకపోతున్నానని వివరించారు. చావు అంచుల వరకూ వెళ్లి మరల మీ మధ్యకు తిరిగి వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు.

ఎవరి మనసూ నొప్పించే మనస్తత్వం నాదికాదని, అలాంటి నన్ను చంపాలని చూడటం దుర్మార్గపు చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాజకీయాలు వదిలేద్దామని‌ అనుకున్నానని, ఎవరికోసం ఈ రాజకీయాలు అంటూ ఆయన మండిపడ్డారు. రాజకీయాలకోసం నాకుటుంబాన్ని బలిపెట్టదలుచుకోలేదని ఆయన వెల్లడించారు. నేను అమలాపురం వదిలి వెళ్లిపోదామని అనుకున్నానని, ఈ విషయం ముఖ్యమంత్రితో చర్చించానన్నారు.

 

Exit mobile version