Site icon NTV Telugu

అక్కడ పోలింగ్ టైం కుదింపు

తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల వాతావరణం నెలకొంది. జిల్లాలోని రంపచోడవరం, ఎటపాక డివిజన్లలో ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 16న నిర్వహించనున్న పోలింగ్‌ సమయాన్ని కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

మారేడుమిల్లి మండలం దొరచింతవానిపాలెం, వీఆర్‌ పురం మండలం చినమట్టపల్లి ఎంటీటీసీ స్థానాలు, ఎటపాక మండలంలోని అన్ని ఎంపీటీసీ స్థానాలకు ఈనెల 16న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్‌ జరుగుతుందని ఎస్ఈసీ తెలిపింది. అధికారులు ఈ విషయాన్ని ఆయా మండలాల్లోని ఓటర్లకు తెలియచేయాల్సి వుంటుంది.

Exit mobile version