సామాన్యులే కాదు.. పేకాడుతూ దొరికిన ప్రముఖులు ఉంటారు.. వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. ఏపీ గేమింగ్ యాక్ట్ 3 అండ్ 4 ప్రకారము సెక్షన్ 275 కింద కేసు నమోదు చేశారు.. ఈ ఎఫ్ఐఆర్ లో ఏ9 గా వరుపుల సుబ్బారావు పేరును చేర్చారు.. గత నెల 26న పేకాడుడూ పోలీసులకు దొరికిపోయారు వరుపుల సుబ్బారావుతో పాటు మరో ఎనిమిది మంది.. వీరి దగ్గర రూ. 53,410 నగదు స్వాధీనం చేసుకున్నారు.. కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరామచంద్రమూర్తి అనే వ్యక్తి ఇంట్లో పేకాట ఆడుతుండగా పట్టుకున్నారు పోలీసులు.. దీంతో, ఇప్పుడు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.. కాగా, తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2014లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన.. అనంతరం జ్యోతుల నెహ్రు ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. అయితే అక్కడ టికెట్ దక్కకపోవడంతో 2019 ఎన్నికల ముందు తిరిగి వైసీపీలో చేరారు. ప్రస్తుతం వైసీపీ అనపర్తి నియోజకవర్గ అబ్జర్వర్‌గా ఉన్నారు సుబ్బారావు.
Read Also: IT Notice To AP Minister Wife: ఏపీ మంత్రి జయరాం భార్యకు ఐటీ నోటీసులు.. ఇలా స్పందించిన మంత్రి..