Site icon NTV Telugu

కరోనా నిబంధనల పై పోలీస్ కమిషనర్ సిన్హా వ్యాఖ్యలు…

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి నందుకు 1989 మంది పై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి అని విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు. ఇక మాస్కులు లేకుండా బయట తిరిగే 4,400 మందిపై వంద రూపాయిలు చొప్పున ఫైన్లు వేసాము. అలాగే 27 మార్చ్ నుండి 5 మే వరకు 15,000 మందిపై రూ.5వందల రూపాయలు చొప్పున ఫైన్ వేసాము. మే5 నుండి ఇప్పటి వరకు 70వేల మంది పై ఫైన్ లు వేసాము అని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో విధులు లో ఉన్న పోలీసులకు ప్రజలు సహకరించాలని కోరుతున్నాము. నగరంలో సాయంత్రం వరకు 99 పికెట్లు రాత్రి 10 నుంచి ఉదయం వరకు 59 పికెట్ లు పెట్టాము

ఇక ప్రస్తుతం 5 కంటే తక్కువ పాజిటివ్ రేటు ఉంది. ప్రజలు సహకరిస్తే త్వరలోనే ఇది రెండు నుంచి మూడు పాజిటివిటి రేటుకి తగ్గే అవకాశం ఉంది కరోనా నేపథ్యంలో కొంత మంది ఖైదీలు జైలు నుంచి విడుదలయ్యారు. దీనివల్ల క్రైమ్ రేట్ పెరుగుతుందేమో అని భావించాం కానీ ఒకటి రెండు చోరీలు తప్ప పెద్దగా ఏమీ జరగలేదు అని పేర్కొన్నారు.

Exit mobile version