ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ని కలిశారు పోలవరం ప్రాజెక్టు సబ్ కాంట్రాక్టర్లు. గతంలో ట్రాన్స్ రాయ్ సంస్థకు సబ్ కాంట్రాక్టర్లుగా పనిచేసి మోసపోయామని ఫిర్యాదు చేసారు 120 మంది సబ్ కాంట్రాక్టర్లు. గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం 20 కోట్లు పైనే ఖర్చు చేసినా బిల్లులు మంజూరు చేయలేదని ఫిర్యాదు చేసారు. అప్పటి నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమ చేతిలో తాము మోసపోయామని తెలిపారు కాంట్రాక్టర్లు. ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. బిల్లులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసారు సబ్ కాంట్రాక్టర్లు. గతంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ను కలసి వినతిపత్రం అందచేసినట్లు తెలిపారు బాధితులు. తమకు న్యాయం జరగకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని సజ్జలకు తెలిపారు బాధితులు. అయితే ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారన్నారు సబ్ కాంట్రాక్టర్లు.
సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన పోలవరం సబ్ కాంట్రాక్టర్లు…
