Site icon NTV Telugu

Narendra Modi: టీడీపీ ఎంపీ కుమార్తెకు చాక్లెట్లు ఇచ్చిన ప్రధాని

Mp Rammohan Naidu

Mp Rammohan Naidu

ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండటంతో దేశ రాజధాని పొలిటికల్ లీడర్లతో సందడిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గత కొన్ని రోజులుగా యువ ఎంపీల కూతుళ్లను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. తాజాగా టీడీపీ యువ ఎంపీ రామ్మోహన్ నాయుడు తన భార్య, కూతురుతో కలిసి ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు కుమార్తెకు ప్రధాని మోదీ చాక్లెట్లు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. కాగా అంతకుముందు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ కుమార్తెకు కూడా ప్రధాని మోదీ తనను కలిసిన సందర్భంగా చాక్లెట్లు అందించారు.

మరోవైపు ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ పలు కీలక సూచనలు చేశారు. బీజేపీ ఎంపీలందరూ సేవ కోసం తమను తాము అంకితం చేయాలని కోరారు. 14 రోజుల పాటు ప్రతి రోజు వారి కోసం ఒక వివరణాత్మక కార్యక్రమాన్ని ప్రధాని మోదీ రూపొందించారు. సమాజంలోని వివిధ వర్గాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని.. వాటి వివరాలను ప్రజలకు చేరవేయాలని ఎంపీలను ప్రధాని మోదీ కోరారు.

https://ntvtelugu.com/tamilnadu-former-built-a-temple-for-his-pet-dog/

Exit mobile version