NTV Telugu Site icon

Pigs Death: ఏపీలో అంతుచిక్కని వ్యాధి.. వెయ్యికిపైగా పందులు మృతి!

Pigs

Pigs

ఏపీలో అంతుచిక్కని వ్యాధి కలవరపెడుతోంది. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులో అంతుచిక్కని వ్యాధితో 15 రోజుల్లో సుమారు వెయ్యి పందులు చనిపోయాయి.పెనుగంచిప్రోలులో తిరుపతమ్మ దేవాలయం దిగువ ప్రాంతంలో కొందరు పందుల్ని పెంచుతున్నారు. పందులు మునేరు పరిసరాల్లో మేతకు వెళ్లి తిరిగిరావడం లేదు. వాటి కోసం వెతికేందుకు వెళ్లిన పెంపకందారులు ఎక్కడపడితే అక్కడ మృతి చెందిన ఉన్న పందులను చూసి షాక్‌ కి గురయ్యారు. పెంపకందారులు ఇప్పటికే కొన్ని వందల కళేబరాల్ని పూడ్చిపెట్టగా, మరికొన్ని కుళ్లిన స్థితిలో కనిపిస్తున్నాయి.

Also Read:Viveka case: సీబీఐ ముందుకు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి.. విచారణపై సర్వత్ర ఉత్కంఠ

పందుల మరణంతో లక్షల్లో నష్టపోయినట్టు పెంపకందారులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాలుగా పందుల్ని పెంచుతున్నాని, ఎప్పుడూ ఇలా జరగలేదని చెప్పారు. పందులకు ఎన్ని మందులిచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. చనిపోయిన పందుల నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రయత్నించినా అవి కుళ్లిపోవడంతో సాధ్యం కాలేదని పశువైద్యులు తెలిపారు. వాటికి పెట్టే ఆహారం, నీళ్లు మార్చాలని పెంపకందారులకు సూచించినట్టు చెప్పారు.