NTV Telugu Site icon

Adikavi Nannaya University : ఈ నెల 18 నుంచి పీజీ స్పాట్ అడ్మిషన్స్..

Adikavi Nannaya University

Adikavi Nannaya University

తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో గల ఆదికవి నన్నయ యూనివర్సిటీ లో పీజీ స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించనున్నట్లు యూనివర్సీటీ వైస్‌ ఛాన్స్‌లర్‌ ఆచార్య మొక్కా జగన్నాథరావు వెల్లడించారు. ఈనెల 18 నుండి పీజీ స్పాట్ అడ్మిషన్స్‌ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాజమహేంద్రవరం, కాకినాడ, తాడేపల్లిగూడెం క్యాంపస్ లలో సైన్స్, ఆర్ట్స్, ఎం.పీ ఈడీ కోర్సులకు సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ ను నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సైన్స్ కోర్సులకు ఈ నెల 18వ తేదీన, ఆర్ట్స్ కోర్సులకు 19వ తేదీన స్పాట్ కౌన్సిలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఉదయం 11 గంటల లోపు వచ్చి రిజిస్టేషన్ చేయించుకోవాలని వీసీ సూచించారు. ఆయా కోర్సులలో ఖాళీ ఉన్న సీట్ల వివరాలు, ఫీజు వివరాలు యూనివర్సిటీ వెబ్ సైట్ లో పొందుపరిచినట్లు ఆయన వెల్లడించారు.

TTD : రికార్డ్ స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు